ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ కంటే ముందే ఏఎన్నార్‌ను ట్రై చేసిందా… అప్పుడేమి జరిగిందంటే..

దివంగత విశ్వవిఖ్యాత నటసౌర్వ‌భౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సమైక్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగువారికి ఒక ఆరాధ్య‌ దైవం. అటు నటుడుగాను.. ఇటు రాజకీయ పరంగాను ఎన్టీఆర్‌ను కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మనుషులలో ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా ఉంటారు.
చ‌క్రి భార్య‌కు రెండో పెళ్లి… ఇప్పుడు ఎక్క‌డుందో తెలుసా…!
అయితే ఎన్టీఆర్ 1994 ఎన్నికలకు ముందు తన జీవిత చరిత్ర రాసేందుకు వచ్చిన లక్ష్మీపార్వతిని అనూహ్యంగా రెండో భార్య‌గా స్వీకరించారు. ఇది కొంతమందికి నచ్చలేదు. అయితే ఆ వయసులో ఎన్టీఆర్‌ను కంటికి రెప్పలా చూసుకునేందుకు.. ఒక తోడు అవసరం అని ఆయన భావించారని.. అందుకే లక్ష్మీపార్వతిని తన అర్ధాంగిగా స్వీకరించారని కొందరు అంటూ ఉంటారు.
బిగ్ షాక్‌: పెళ్లైన నెల రోజుల‌కే సుజాత పెట్టే టార్చ‌ర్ భ‌య‌ట‌పెట్టిన రాకేష్‌

ఏది ఏమైనా చివరలో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాకే తెలుగుదేశం పార్టీ రాంగ్ రూట్లోకి వెళ్లబోయిందని.. అందుకే చంద్రబాబుకు, నందమూరి కుటుంబ సభ్యులు కొందరు పార్టీ నేతలు కలిసి తిరుగుబాటు చేశారని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు వెళ్లిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ను నిజంగా మాయ చేసి.. తన బుట్టలో వేసుకుందని.. కూడా కొందరు ఎన్టీఆర్ అభిమానులు విమర్శలు చేస్తూ ఉంటారు.
వాట్..విజయశాంతికి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..? ఇన్నాళ్లకు బయట పడ్ద అసలు నిజం..!

అయితే సీనియర్ జర్నలిస్టు ప్రముఖ సినీ విశ్లేషకులు ఈమంది రామారావు లక్ష్మీపార్వతి గురించి మరో సంచలన విషయం బయట పెట్టారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయటానికి ముందే ఏఎన్ఆర్ దగ్గరకు కూడా వెళ్లింది అని.. ఆయన దగ్గరికి వెళ్లి ఆయన జీవిత చరిత్ర రాస్తాను అంటూ ఆయనను కాకా పట్టేందుకు కూడా ట్రై చేసిందని స్వయంగా చెప్పారు. ఈ మాట‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని.. అవసరమైతే లక్ష్మీపార్వతి నా ముందుకు వచ్చి ఏఎన్ఆర్ దగ్గరకు వెళ్లలేదని చెప్పాలన్నారు.
బాల‌య్య ఇద్ద‌రు కూతుళ్ల సంబంధాలు సెట్ చేసింది ఎవ‌రంటే.. బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని పెళ్లిళ్ల వెన‌క ట్విస్ట్ ఇదే..!

ఈమంది రామారావు దగ్గర ఆమె పప్పులు ఉడకవని మరి గంటాపథంగా చెప్పారు. అయితే ఏఎన్ఆర్ అమ్మా నా జీవిత చరిత్ర రాయాల్సిన అవసరం లేదు.. అవసరమైతే నేనే కబురు చేస్తాను అంటూ పంపేశారని తెలిపారు. చివరకు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఇంటి చుట్టూ తిరిగి.. ఆయనను కాకా పట్టి చివరకు ఆయనను బుట్టలో వేసుకుని ఆయన జీవిత భాగస్వామి అయిందని కూడా రామారావు చెప్పారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ ది రామారావు బయట పెట్టడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొడాలి నాని వెన్నుపోటు నిజంగానే పొడిచాడా… ఎస్ ఇది 100 % నిజం..!