రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. కానీ, ఓడిపోతామన్న బాధ. నియోజకవర్గంలో ఎటు వెళ్లినా.. ఎదురవుతున్న వ్యతిరేకత వంటివి.. వైసీపీ నాయకుడు కోన రఘుపతికి నిద్రపట్టనివ్వడం లేదు. అందుకే ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల నియోజక వర్గం నుంచి వరుసగా మూడో సారి పోటీ చేస్తున్నఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. పోటీలో ఉన్న ఏ నాయకుడు అయినా.. దీని కోసమే ప్రయత్నిస్తారు.
అయితే. అది పాజిటివ్ పోటీ అయి ఉండాలి. గత రెండు సార్లు కూడా (2014, 2019) కోన పాజిటివ్ గానే రాజకీయాలు చేశారు. కానీ, ఇప్పుడు మూడోసారి వచ్చేసరికి ఆయన ఫేట్ తిరగబడే అవకాశం కళ్లముందు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కుట్ర పూరిత రాజకీయాలను ఎంచుకున్నారనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్న వేగేశ్న నరేంద్ర వర్మ కేంద్రంగా కోన కుట్ర పూరిత రాజకీయాలకు తెరదీశారు.
వర్మకు.. రాయల్ మెరైన్ అనే కంపెనీ ఉంది. దీని ద్వారా వస్తున్న ఆదాయంతోనే ఆయన నియోజకవ ర్గంలో పేదలను ఆదుకుంటున్నారు. అడిగిన వారికి ఎలాంటి సాయమైనా చేస్తున్నారు. నీళ్లు లేక అల్లాడుతున్న ప్రాంతాలకు ట్యాంకులు పంపించినా.. ఎస్సీ, ఎస్టీలకు నియోజకవర్గంలో ఆర్థికంగా సాయం చేసినా.. ఈ సంస్థ నుంచి వస్తున్న ఆదాయం నుంచే చేస్తున్నారు. అయితే.. కోన ఇక్కడే దెబ్బ కొట్టాలని చూశారు. రాయల్ మెరైన్ కంపెనీని నిలిచిపోయేలా చేస్తే.. తనకు ఎదురుండదని లెక్కలు వేసుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మెరైన్ కంపెనీలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు.. ఏప్రిల్ 1న చెల్లించాల్సి న జీతాల కోసం.. తెచ్చిన సొమ్మును ఎన్నికల్లో పంచేందుకు తెచ్చారంటూ.. నానా యాగీ చేశారు. దీనిపై అధికారులకు కూడా ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన అధికారులు నిజాలు నిగ్గు తేల్చారు. ఇది ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల సొమ్మేనని నిర్ధారించారు. అక్కడితో కథ అయిపోయింది.
కానీ, కోన చేసిన.. ఈ కుట్ర రాజకీయం మాత్రంనియోజకవర్గంలో హాట్ టాపిక్ అయిపోయింది. నేరుగా వర్మను ఎదుర్కొనలేక.. ఆయనపై నిందలు వేస్తున్నారంటూ.. క్షేత్రస్థాయిలో జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇది కోన గ్రాఫ్‌ను మరింత డీలా పడేలా చేసింది. అదేసమయంలో వేగేశ్న నిజాయితీ మాత్రం ఐ షేపులో మరింత పెరిగిపోయింది. ఇదీ.. బాపట్లలో ప్రస్తుతం హాట్ టాపిక్.