ఆయన టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. నోరు విప్పితే నిప్పులు కురిసినట్టుగా ఉంటుంది. దీంతో అందరూ ఆయనను అమ్మో.. ఆ నాయకుడా! అని అనుకుంటారు. కానీ, పైకి అలా ఉన్నా.. ఆయన కోపం కర్పూరపు సెగ లాంటిదే తప్ప.. మనసు మాత్రం వెన్న అంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు.. ఆయనను సమీపం నుంచి చూసిన వారు. ఆయనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మాటల తూటాలు పేల్చడంలో ఆయన ముందున్నా.. అంతకుమించి పేదలకు చేసే సేవలు.. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టం తనదే అనుకుని వెంటనే స్పందించే గుణం… ఆయన చేస్తున్న సేవలు.. కురిపించే వరాలు చూస్తే చింతమనేని దానగుణం ఎలాంటిదో తెలుస్తుంది.
ప్రస్తుతం.. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ఎన్నికల ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. ఉదయం, సాయంత్రం కూడా రకరకాల ప్రోగ్రామ్‌లు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేవలం సభలు పెట్టడం.. పాదయాత్ర చేయడం, ప్రజలను కలుసుకోవడం వరకే ఆయన సరిపెట్టడం లేదు. ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న సమస్యలను సాధ్యమైనంత మేరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చింతమనేని.. పాదయాత్ర చేస్తున్న సమయంలో తన నియోజకవర్గానికి సంబంధం లేని ఓ దళిత కుటుంబం తారస పడింది. వారు మేకలు కాచుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు.
ఈ విషయం తెలిసిన చింతమనేని 100 చూడు మేకలు ఇస్తాననిహామీ ఇచ్చారు. మీరు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు సాయం చేస్తానని వారు కోరకుండానే మాటిచ్చారు. అన్నట్టుగానే.. చింతమనేని.. అదే రోజు ఆ కుటుంబానికి చూడు మేకలు ప్రత్యేక వాహనం ఇచ్చి మరీ పంపించారు. ఇక, చింతమనేని ఇల్లు అంటే.. నిత్యం అన్నసంతర్పణతో వేల మంది ఆకలి తీర్చే భోజన శాల అనే చెప్పాలి. ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా.. భోజనం చేసి.. చేయి కడిగి వెళ్లాల్సిందే. ఉదయం టిఫిన్లతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్న భోజనం.. తర్వాత స్నాక్స్.. రాత్రి మళ్లీ భోజనం గత పదేళ్లుగా దీనిని ఒక యజ్ఞంగా చేస్తున్నారు. ఎంతోమంది పేదలు, నిరుపేదలు చింతమనేని ఇంటి భోజనంతో కడుపు నింపుకున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ.. ఉద్యమిస్తున్న ఆశావర్కర్లను కూడా.. ఆయన ఆదుకున్నారు. ఛలో విజయవాడ కార్యక్రమం తల పెట్టిన ఆశావర్కర్లను పోలీసులు నిర్బంధించారు. దీంతో వారంతా మలమల మాడిపోతూ.. స్టేషన్లలోనే ఉన్నారు. వీరు ఆకలితో అలమటిస్తుంటే కనీసం పట్టించుకున్న వారే లేరు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని.. స్వయంగా రంగంలోకి దిగారు. దుగ్గిరాలలోని ఎన్టీయార్ చింతమనేని జనతా క్యాంటీన్ ద్వారా ఆశాల కోసం ఆహారం సిద్ధం చేసి తరలించారు. వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు.
అంతేకాదు.. వారి పక్షాన తాను కూడా గళం విప్పుతానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం కనీసం ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించడం లేదని.. ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ మా పొట్ట కొడితే చింతమనేని మాకు అన్నం పెట్టి ఆకలి తీర్చాడని కితాబిచ్చారు. చింతమనేని చేసిన పనికి ఆశా వర్కర్లు మా చింతమనేని మనసు వెన్న అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఇంకేం కావాలంటూ ప్రశ్నిస్తున్నారు.