గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పిడుగురాళ్ల మాధవి త్రిముఖ వ్యూహంతో ముం దుకు సాగుతున్నారు. ఆమె అభ్యర్థిత్వం ప్రకటించగానే.. అనేక మంది నాయకులు ఆమె గెలిచిందనే లెక్కలు వేస్తున్నారు. దీనికి కారణం.. త్రిముఖ వ్యూహంలో మూడు అంశాలు కీలకమైనవి కావడం. అంతేకా దు.. ప్రజల్లోనూ ఇవే ఆమె చర్చకు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఈ మూడు వ్యూహాలనే చర్చిస్తున్నా రు. ప్రతి విషయాన్ని చర్చిస్తున్నా.. ప్రధానంగా ఈ మూడు అంశాలను మాత్రం మాధవి ప్రస్తావిస్తున్నారు.
1) బలమైన పార్టీ వ్యూహం: టీడీపీ బలమైన వ్యూహాన్ని మాధవి ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని అభి వృద్ధి బాట పట్టించాలనేది టీడీపీ కల. దీనిని సాకారం చేసుకునేందుకు పార్టీ ఏవిధంగా ముందుకు సాగు తోందనే విషయాన్ని మాధవి పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు వంటి విజన్ ఉన్న నాయకుడు వస్తే నే తప్ప.. రాష్ట్రంలో మేలు జరగదని, ఉపాధి, ఉద్యోగాలు వంటివి రావని ఆమె ప్రస్తావిస్తున్నారు. నిజానికి ప్రజల్లోనూ ఇదే తరహా ఆలోచన ఉంది. దీంతో ఆమెకునియోజకవర్గం ప్రజలు మనస్పూర్తిగా కనెక్ట్ అయ్యారు.
2) వైసీపీ వ్యతిరేకత: ఇక్కడ రెండు అంశాలను ప్రధానంగా మాధవి చెబుతున్నారు. ఒకటి వైసీపీ అభ్యర్థి విడదల రజనీ వ్యవహారం. రెండు ప్రభుత్వ వ్యవహారం. రజనీ ప్రస్తుతం చిలకలూరిపేటలో ఎమ్మెల్యే కమ్ మంత్రిగా ఉన్నారు. అక్కడ ఆమె ప్రజలకు చేరువ కాలేకపోయారు. అంతేకాదు.. కనీసం.. రజనీని ప్లేస్ మారిస్తే.. ఏ ఒక్కరూ అడ్డుకున్న పాపాన కూడా పోలేదు. అంటే.. ఆమె అంతగా ప్రజలలో వ్యతిరేకతను పెంచుకున్నారు. ప్రజలను పట్టించుకోలేదు. వారిని రాచి రంపాన పెట్టారన్న వాదన కూడా ఉంది.
ఇక, ప్రభుత్వ వ్యతిరేకత విషయాన్ని కూడా మాధవి ప్రస్తావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంభించిన పనితీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. పథకాల పేరుతో రూ.10 ఇచ్చి పన్నులు, ధరల పేరుతో రూ.100 లాగేసిన వైనాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇదే తమకు మేలు చేస్తుందని.. రాష్ట్రంలో అధికారాన్ని మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని మాధవి బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో వాటినే ఆమె ప్రచారంలోకి తీసుకువస్తున్నారు.
3) మహిళా సాధికారత: ఈ విషయంలో వైసీపీ, టీడీపీ కూడా ఒకే పంథాను అనుసరించాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా గుంటూరు వెస్ట్ సీటును మహిళలకే , ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించాయి. కానీ మాధవి మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు. అసలైన మహిళా సాధికారత టీడీపీలోనే ఉందని అంటున్నారు. ఎందుకంటే.. వైసీపీలో కేవలం రజనీకి మేలు చేయాలని, చిలకలూరిపేటలో అయితే ఆమె ఓడిపోతారని భావించి.. గుంటూరు వెస్ట్‌కు తీసుకువచ్చారు.
కానీ, టీడీపీలో మాత్రం 15 మంది బరిలో నిలిచినా.. మహిళా అభ్యర్థిని ఎంచుకున్నారు. దీనికి కారణం మహిళలకు జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించాలన్న ఏకైక కారణమేనని మాధవి నమ్ముతున్నారు. ఇది కూడా వాస్తవమే. 15 మంది పోటీ పడిన ఈ టికెట్‌ను చంద్రబాబు ఏరికోరి మాధవికి ప్రకటించడం వెనుక ఏకైక రీజన్ మహిళా సాధికారతేనని చెబుతున్నారు. అందుకే.. మాధవి తన గెలుపుపై అంత నమ్మకంతో ఉన్నారు.
4) ఉమ్మడి అంశాలు: అటు వైసీపీ, ఇటు టీడీపీని గమనిస్తే.. రెండు ఉమ్మడి అంశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా టీడీపీ అభ్యర్థి మాధవి ప్రస్తావిస్తున్నారు. అదే.. బీసీ(ముదిరాజ్)-కాపు సామాజిక వర్గం తరఫున వైసీపీ టికెట్ .. మంత్రి రజనీ సంపాయించుకున్నారు. ఇక, బీసీ(రజక)-కమ్మ సామాజిక వర్గం తరఫున మాధవి టీడీపీ నుంచి బరిలో నిలిచారు. అభ్యర్థుల సామాజిక వర్గాల పరంగా చూస్తే.. రజక అనే అంశం కలిసి వస్తున్నా.. దీనిని మాధవి ఒప్పుకోవడం లేదు.
ఎందుకంటే.. కులాలు.. మతాలు ప్రాతిపదికన సేవ చేయడం సరికాదని అంటున్నారు. తాను బీసీనని మంత్రి ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ.. తాను మాత్రం వెనకబడిన వర్గాలు అయిన బీసీలతో పాటు అన్ని కులాల్లో ఉన్న పేదల కోసం.. ప్రజల కోసం రంగంలోకి దిగానని చెబుతున్నట్టు మాధవి తెలిపారు. ఇదే ప్రజలకుతనను అత్యంత తక్కువ కాలంలో కనెక్ట్ చేసిందని అంటున్నారు. ఎప్పుడైనా కూడా.. రాజకీయాల్లో ఈ ఫార్ములానే పనిచేస్తుందని, కులాలను బట్టి ప్రజలు గెలిపించరని అంటున్నారు. సో.. ఆమె విజయం ఇప్పటికే.. ఖాయమైందని ఈ ఆలోచన గురించి తెలిసిన వారు చెబుతుండడం గమనార్హం.