వినుకొండ జ‌నాలు ఈ సారి ఆ త‌ప్పు చేయ‌ర‌ట‌… ఎవ‌రిని గెలిపించాలో డిసైడ్ అయిపోయారా..?

ఒక్కొక్క సారి ప్ర‌జ‌లు త‌మ‌ను తాము తెలుసుకుంటారు. ఒక‌సారి ఏదైనా పొర‌పాటు చేశామ‌ని అనుకుంటే.. ఇక‌, జీవితంలో ఇంకోసారి ఆ పొర‌పాటు చేయ‌రు. ఇప్పుడు ఇదే మాట ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని విను కొండ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. 2019లో ఇక్క‌డ వైసీపీ నేత‌.. బొల్లా బ్ర‌హ్మ‌నాయుడికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఆయ‌న వ‌ల్ల త‌మ‌కు భారీ ఎత్తున మేళ్లు జ‌రుగుతాయ‌ని అనుకున్నారు. కానీ, ఈ ఐదేళ్ల‌లో వారికి ఒరిగింది ఏమీ లేద‌నే టాక్ వినిపిస్తోంది.

`క‌నీసం మ‌మ్మ‌ల్ని ఎమ్మెల్యే ఆఫీసుకు రానిచ్చారా? మా మొర విన్నారా? పాపం.. సురేష్ అని వైసీపీ వోడే.. మా స‌మ‌స్య‌లు చెప్పుకొంటే వినేవాడు. ఆయ‌న‌ను కూడా అరెస్టు చేయించి పోలీసులతో కొట్టించా డు. అయ్యా.. ఏదో అయిపోయింది. మాకు బుద్దొచ్చింది. మేం మారాం. మేం ఇంక జీవీ సార్‌కే ఓటే స్తాం. ఇది మామాటే కాదు.. నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రూ ఇదే చెబుతున్నారు` అని వినుకొండ‌కు చెందిన రైతులు చెబుతున్నారు.

వినుకొండ సాధార‌ణంగా రైతులు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. కానీ, ఇక్క‌డ వారికి ఎమ్మెల్యే అందుబా టులో లేకుండా పోయారు. పైగా తాగునీటికి ఇక్క‌ట్లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కూడా. ఏ స‌మ‌స్య చెప్పుకొందామ‌న్నా.. వారి మాట‌ల‌ను వినిపించుకునే తీరిక ఎమ్మెల్యే బొల్లా క‌ల్పించ‌లేద‌న్న‌ది వాస్త‌వం. పైగా.. ప్ర‌శ్నించిన వారిపై పోలీసుల‌ను పురిగొల్పి కేసులు పెట్టించారు. అంతేకాదు.. దొర అనిసంబోధిం చాంటూ.. గ్రామాల్లో ట‌ముకు వేయించుకున్నార‌నే టాక్ ఉంది.

ఇక‌, ఎవ‌రైనా సాహ‌సం చేసి.. ఎమ్మెల్యే ముందుకు వెళ్లినా.. నీకు బాగా బ‌లిసింది.. అందుకే ముందుకు వ‌చ్చి ప్ర‌శ్నిస్తున్నావ్‌. నువ్వు టీడీపీకి కొమ్ము కాస్తున్నావు.. అంటూ అవ‌హేళ‌న చేయ‌డంలోనూ బొల్లా సిద్ధ‌హ‌స్తుడుగా పేరు తెచ్చుకున్నారు. అస‌లు ఆయ‌న క‌న్నా.. ఆయ‌న వార‌సుడు బొల్లా గిరిబాబు చ‌క్రం తిప్ప‌డం.. ప్ర‌తి ప‌నికీ రేటు క‌ట్ట‌డం.. వంటివి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు మ‌రిచిపోవాల‌న్నా.. మ‌రిచిపోలేక పోతున్నారు. అందుకే.. ఈ సారి గ‌త ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పు చేయ‌మ‌ని ఇక్క‌డ ముక్తకంఠంతో చెబుతున్నారు. దీంతో టీడీపు గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌గా మారిందని అంటున్నారు ప‌రిశీల‌కులు.