2019 ఎన్నికలకు ముందు వరకు బీసీల్లో బలమైన యాదవ కమ్యూనిటీ అంతా టీడీపీకి కలిసికట్టుగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. టీడీపీతో కెరీర్ స్టార్ట్ చేసిన యనమల వంటి వారు 40 ఏళ్లు అవుతున్నా ఇప్పటకీ పార్టీలో ఎంత కీరోల్ పోషిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఏపీలో యనమల, సుధాకర్ యాదవ్, అటు తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యాదవ నేతలను తయారు చేసిన ఓ పొలిటికల్ ఖార్ఖానా తెలుగుదేశం పార్టీ.
గత ఎన్నికల్లో జగన్ రకరకాల ప్రయత్నాలు చేసి వీరిలో కొందరిని నమ్మించ గలిగాడు. ఐదేళ్ల జగన్ పాలనలో తాము ఎంత నయవచంనకు గురయ్యామో… తమను జగన్ ఎంతలా నమ్మించి సర్వనాశనం చేశాడో వారికి అర్థమైంది. పేరుకు మాత్రమే ఒకరిద్దరికి పదవులు ఇచ్చినా… పెత్తనం అంతా రెడ్లే చేస్తూ యాదవ ప్రజాప్రతినిధులను ఘోరంగా అవమానించి.. ఇప్పుడు ఎన్నికల టైంలో వారి పొలిటికల్ కెరీర్‌ను ముగించే కుట్ర పన్నాడనే వారు ఆరోపిస్తున్నారు.
ఒక్కసారి వైసీపీలో ఉన్న యాదవ సామాజిక వర్గ ప్రజాప్రతినిధుల కష్టాలు చూస్తే….
అనిల్‌కుమార్ నెల్లూరు టు నరసారావుపేట :
మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ మైకు దొరికితే చాలు జగన్ భజన చేస్తూ.. ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడడంతో పాటు జగన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సినంత నెగటివిటీ మూటకట్టుకున్నారు. అలాంటి అనిల్‌ను నెల్లూరు రెడ్లు అందరూ ఏకమై అతడిని పక్కన పెట్టాలని జగన్‌కు చెప్పడంతో జగన్ తన రెడ్ల కోసం అనిల్‌ను మూడు జిల్లాలు దాటించేసి నరసారావుపేట పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయమని ఆదేశించారు. అనిల్‌కు ఇది ఇష్టంలేకపోయినా కక్కలేక మింగలేక అక్కడ పోటీలో ఉన్నారు.
మంత్రి కారుమూరి ఫ్యామిలీ :
కారుమూరి సునీల్‌కుమార్‌కు జగన్ ప్రేమతో ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వలేదన్నది జగమెరిగిన సత్యం. ముందుగా భారీ రేటుకు భేరం పెట్టిన జగన్ అక్కడ వర్కవుట్ అయ్యే పరిస్థితి లేక… మంత్రి కారుమూరిని బతిమిలాడి నీకు మంత్రి పదవి ఇచ్చాం కదా… మీ కుమారుడిని తప్పక ఏలూరు ఎంపీగా పోటీ చేయించాలని బలవంతం చేయడంతో అయిష్టంగానే ఆయన అంగీకరించారు.
మాజీ మంత్రి పార్థసారథికి అవమానించి పంపేశారు :
ఇక పెనమలూరులో మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి ఈ ఐదేళ్లలో జగన్ దగ్గర ఎన్నో అవమానాలు భరించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా… యేడాది ముందునుంచి వ్యూహం ప్రకారమే సారథి పార్టీ మారిపోతున్నారంటూ జిల్లాలో ఉన్న కొందరు వైసీపీ నేతలతో బ్యాడ్ ప్రాపగండా చేయించి ఆయన అవమానించి ఆయనే పార్టీ మారిపోయేలా చేశారు. పార్థసారథి పార్టీ వీడిని వెంటనే చంద్రబాబు ఆయనకు రెడ్‌కార్పెట్ వేసి మరీ నూజివీడు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు.
మధును రెడ్లందరూ కనిగిరి నుంచి కందుకూరుకు తరిమేశారు..
ఇక పార్థసారథి వియ్యంకుడు అయిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అతి సామాన్యమైన స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. కనిగిరలో బుర్రా మధుసూదన్ యాదవ్ గత ఎన్నికల్లో ఏకంగా 40 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి అక్కడ రెడ్లు అందరూ కలిసి బుర్రాను రాజకీయంగా అణగదొక్కేసి సీటు లేకుండా చేశారు. చివరకు ఆయన జగన్‌ను బతిమిలాడితే కందుకూరు సీటు ఇచ్చారు. కనిగిరిలో పదేళ్లు పనిచేసుకున్న బుర్రాకు కందుకూరు పూర్తిగా కొత్త.
జంగా కృష్ణమూర్తిని చూస్తే జాలేస్తోందిగా…
బీసీ యాదవ కమ్యూనిటీలో జంగా కృష్ణమూర్తి నాడు వైఎస్సార్ ఆ తర్వాత జగన్ వెంటే నడుస్తూ వచ్చారు. 2014లో గురజాలలో జంగా ఓడిపోయారు. 2019లో తన కులపోడు కాసు మహేష్‌రెడ్డికి సీటు కోసం జంగా సీటు తీసేసిన జగన్ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినా ప్రయార్టీ లేకుండా చేసేశాడు. ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్నా జంగాను చేయాల్సినన్ని అవమానాలకు గురిచేశారు. ఈ సారి ఎలాగైనా పోటీ చేస్తానని పట్టుబడినా సీటు ఇవ్వలేదు. జంగా ఎన్నికలకు ముందు ఎప్పుడైనా వైసీపీ నుంచి బయటకు వచ్చి పార్టీ మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
వంశీకృష్ణ సీటు చించేసిన జగన్…
విశాఖకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ కంచుకోట అయిన తూర్పు నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనే వంశీని తప్పించి వేరే వాళ్లకు సీటు ఇచ్చినా అంత వేవ్‌లోనూ తూర్పులో వైసీపీ చిత్తుగా ఓడింది. …