దెందులూరు టీడీపీలోకి భారీ వ‌ల‌స‌లు… అబ్బ‌య్య గ్యాంగ్‌ ప్ర‌స్టేష‌న్ ఫుల్ ఫీక్స్‌…!

ఎన్నిక‌ల‌కు తెర‌లేస్తుండ‌డంతో ఏలూరు జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. అధికార వైసీపీ నుంచి ప్ర‌తిప‌క్ష టీడీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు కంటిన్యూ అవుతున్నాయి. చింత‌మ‌నేని ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. చింత‌మ‌నేని ఏ ఊరు వెళ్లినా వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌ల‌స‌లు ఆగ‌డం లేదు. ప్ర‌తి రోజు ఎక్క‌డో ఓ చోట టీడీపీలో చేరిక‌లే ఉంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ వ‌ర్గాల నుంచే సాధార‌ణ కేడ‌ర్‌, వైసీపీ అభిమానులు ఎక్కువుగా టీడీపీలో చేరుతున్నారు.

పెద‌పాడు, పెద‌వేగి, దెందులూరు ఏ మండ‌లం చూసినా టీడీపీ వైపు చేరిక‌లు ఉంటున్నాయి. వారం రోజుల వ్య‌వ‌ధిలో పెదపాడు మండలం ఏపూరులో వైసిపి నాయకులు తమ్మినేని తాతారావు, రాజులపాటి సత్యనారాయణ, రాజులపాటి శ్రీనివాస్ తో పాటు, సమ్మెట్ల భాస్కర్ రావు కరుణల ఆధ్వర్యంలో రెడ్డి రాంబాబు, వీర్ల రామకృష్ణ, తారా కుమార్ బాబు చౌదరి, కెళ్ళ పరమేశ్వర రావు, కంచర్ల చంద్రశేఖర్, కొంపిల్లి చంటి సహా దాదాపు 20 కుటుంబాలు టిడిపిలో చేరాయి.

ఇటు అబ్బ‌య్య చౌద‌రికి సొంత మండ‌లం అయిన పెదవేగి మండలం కూచింపూడిలో వైసీపీని వీడి 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్‌తో పాటు మండ‌లానికి చెందిన ఇత‌ర పార్టీ నేత‌లు, పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల స‌మ‌క్షంలో ఈ చేరిక‌లు ఉన్నాయి. పార్టీలో చేరిక‌ల సంగ‌తి ఇలా ఉంటే నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వైసీపీ నేత‌ల క‌వ్వింపు చ‌ర్య‌లు మామూలుగా లేవు. టీడీపీలోకి వ‌ల‌స‌లు ఈ రేంజ్‌లో ఉంటే ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రితో పాటు ఆ పార్టీ నాయ‌కుల ప్ర‌స్టేష‌న్ కూడా ఓ రేంజ్‌లో ఉంటోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ అబ్బ‌య్య‌లో ఉన్న ధీమా, ప‌ట్టు ఇప్పుడు బాగా స‌డ‌లుతోన్న వాతావ‌ర‌ణ‌మే ఇక్క‌డ స్థానికంగా క‌నిపిస్తోంది.

టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ అల్ల‌రి మూక‌లు దాడులు చేస్తూ ఎన్నిక‌ల వేళ గ్రామాల్లో ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మ‌వుతున్నారన్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల కొప్పాక గ్రామానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త కాటేపల్లి నాగ సురేష్ ఇంటి మీద వందల సంఖ్యలో కర్రలు, మ‌ర‌ణాయుధాల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. కేవ‌లం పోల‌వ‌రం అక్ర‌మ మ‌ట్టి త‌వ్వ‌కాల‌కు అడ్డు వ‌స్తున్నాడ‌నే ఈ దాడులు చేశారు. ఏలూరు ప్ర‌భుత్వాసుప‌త్రి ద‌గ్గ‌ర కూడా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎదురుకాగానే వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి అక్క‌డ భ‌యాన‌క వాతావ‌ర‌ణం క్రియేట్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

సాక్షాత్తూ పోలీసులు ఉండ‌గానే జ‌డ్పీ చైర్మ‌న్ భ‌ర్త ఘంటా ప్ర‌సాద్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు చింత‌మ‌నేని మీడియాతో మాట్లాడుతుండ‌గానే గేట్ – 1 వ‌ద్ద‌కు చేరుకుని క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి టీడీపీ వాళ్ల‌ను రెచ్చ‌గొట్టేలా బిహేవ్ చేశారు. పోలీసులు ఎంతో శ్ర‌మిస్తే కాని వైసీపీ నాయ‌కుల‌ను అదుపు చేయ‌డం సాధ్యం కాలేదు. ఏదేమైనా దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి ఈ సారి ఎన్నిక‌ల్లో ఏటికి ఎదురీదుతోన్న సిగ్న‌ల్స్ ముందుగానే క్లీయ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి.