బిగ్ షాక్‌: పెళ్లైన నెల రోజుల‌కే సుజాత పెట్టే టార్చ‌ర్ భ‌య‌ట‌పెట్టిన రాకేష్‌

బుల్లితెర కామెడీ షోలో ఉన్న కమెడియన్లతో పాటు జబర్దస్త్ లాంటి షోలో ఉండే కంటెస్టెంట్లపై ఎన్నో రకాల రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని కొందరు లైట్ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం కాస్త సీరియస్ గా తీసుకుంటారు. ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి పాపులర్ అయిన వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు.

Will Fix Wedding Date With Rocking Rakesh This Month End: Jordar Sujatha

మొదట చిన్నపిల్లలతో స్కిట్లు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ జోర్దార్ సుజాత వీరి టీంలో చేరింది. అప్పటి నుంచి రాకింగ్ రాకేష్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి. సుజాతతో రాకేష్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరికి వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అనంతరం నెల రోజుల క్రిందట పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Jordar Sujatha Interesting Comments On Her Love Story, Rocking Rakesh  Jordar Sujatha Love Story | Jordar Sujatha - Rocking Rakesh : సుజాతను  స్మశానానికి తీసుకెళ్లిన రాకింగ్ రాకేష్ - ఇదేం ప్రేమ ...

ఇలాంటి టైంలో రాకేష్, సుజాత గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జబర్దస్త్ స్కిట్లో భాగంగా రాకేష్ నువ్వు సుజాతని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నావా ? అని అడిగిన ప్రశ్నకు కాస్త డిఫరెంట్గా ఆన్సర్ చేశాడు. మాది పవిత్రమైన ప్రేమ అని సుజాతను ఓవైపు పొగుడుతునే.. బొంగులో ల‌వ్ ప్రేమించేదాకా ప్రేమ, ప్రేమ అని వెంటపడుతుంది… ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టింది. ఆ టార్చర్ మామూలుగా లేదు అంటూ రాకేష్ కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.

Jabardasth Rocking Rakesh Marriage With Jordar Sujatha, Deets Inside -  Sakshi

ఇక ఈ స్క్రిప్ట్ చూసిన కొందరు నెటిజన్లు స్కిట్ కోసం తమ సంసార జీవితాన్ని హేళ‌న‌ చేయడం మంచిది కాదు అని రాకేష్ కు సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే నెల రోజులకే నీకు సుజాత మీద ప్రేమ తగ్గిపోయిందా ? అంత టార్చర్ చూపించిందా అని కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై సుజాత నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుందో చూడాలి.

Tags: filmy updates, intresting news, Jabardasth, jordar sujatha, latest viral news, rocking rajkesh, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news