ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ జాతీయ మీడియా సంస్థ, సర్వేల్లో ఎంతో క్రెడిబులిటీ ఉన్న ఇండియా టుడే కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారో తన సర్వేతో అంచనా వేసింది. ఏపీలో టీడీపీ ప్రభంజనం ఖాయమని ఈ సర్వే స్పష్టం చేసింది.
ఏపీలో టీడీపీ – జనసేన కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పింది. లోక్‌సభ సీట్లలో ఎవరు ఎన్ని గెలుస్తారో చెప్పడంతో పాటు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పేసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ + జనసేన కూటమికి 17 లోక్‌సభ సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇక అధికార వైసీపీ కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోనుంది.
ఇక ఓట్ల శాతంలోనూ టీడీపీ వైపే మొగ్గు కనపడింది. టీడీపీ – జనసేన కూటమిఇక 45 శాతం ఓట్లు రానున్నాయి. ఇక వైసీపీకి 41 శాతం, బీజేపీ 2.1, కాంగ్రెస్ 2.7 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అంటే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కే ఎక్కువ శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చిచెప్పింది. ఏదేమైనా టీడీపీ + జనసేన కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చేసింది.