టీడీపీ మహిళా అభ్యర్థి, గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న పిడుగురాళ్ల మాధవి డేరింగ్ స్టెప్ తీసుకు న్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక సంస్థల్లో మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తామని… మైనారిటీలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. నిజానికి ఇది సంచలన ప్రకట న. ఇప్పటి వరకు ఏ నాయకుడు కానీ, ఏ నాయకురాలు కానీ ఇలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో మాధవి చేసిన ప్రకటన పట్ల.. మైనారిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఏం జరిగింది..?
అసలు మాధవి ప్రకటన వెనుక ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. గుంటూరు వెస్ట్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి పోటీ చేస్తున్నారు. అయితే.. ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీకి 20 శాతం ఓటు బ్యాంకు ఉంది. వాస్తవంగా తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల డామినేషన్ ఎక్కువ. అక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. ప్రతిసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా కూడా వాళ్లే పోటీ చేస్తుంటారు. అలాగే వెస్ట్ నియోజకవర్గంలోనూ మైనార్టీల ఓట్లకు ప్రాధాన్యం ఉంది.
అభ్యర్థుల గెలుపు ఓటముల్లో వారు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నా.. మైనారిటీల మద్దతు చాలా అవసరం. ఈ నేపథ్యంలో వారిని మచ్చిక చేసుకునేందుకు రెండు మూడు పథకాలు ప్రకటించి వదిలేస్తు న్న నాయకులు, పార్టీలు ఉన్నాయి. అయితే.. దీనికి విరుద్ధంగా.. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లోనూ మైనారి టీలకు ప్రాధాన్యం ఇస్తామని మాధవి చెప్పడం గమనార్హం.
నిజానికి ఇది సంచలన నిర్ణయమేనని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో బీసీల్లోని కులాలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. లేదా.. వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. కానీ, తొలిసారి.. మైనారిటీలకు అవకాశం ఇస్తామని చెప్పడం ద్వారా మాధవి డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. గుంటూరు మేయర్ నుంచి ఇతర పదవుల వరకు మైనారిటీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు గుంటూరు మేయర్‌గా మైనారిటీలకు అవకాశం లభించలేదు. కానీ.. ఇప్పుడు మాధవిని గెలిపించుకోవడం ద్వారా మైనారిటీలు ఈ కలను సాధించుకునే అవకాశం ఉంది.
అంతా మైనారిటీల చేతుల్లోనే..!
రాజ్యాధికారానికి చేరువ కాలేక పోతున్నామని చెబుతున్న మైనారిటీలకు గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి మాధవి చేసిన ప్రకటన.. కొంగు బంగారమేనని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మాధవిని గెలిపించుకునేందుకు మైనారిటీలు కృషి చేయడం ద్వారా.. తమను తాము నిలబెట్టుకునేందుకు స్థానిక సంస్థల్లో మైనారిటీలను ఓ వెలుగు వెలిగేలా చేసుకునేందుకు అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించా ల్సి ఉంది. ఇప్పుడు కావాల్సింది.. మైనారిటీల్లో ఐక్యత. అంతేకాదు.. ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు వాడుకుని వదిలేస్తున్నారు? అనేది కూడా గమనించాల్సి ఉంది.
ఈ తరహా ఆలోచనల నుంచి మైనారిటీ వర్గాలు నిజాలు గ్రహించి. మాధవికి అండగా నిలిస్తే.. రాబోయే రోజుల్లో మైనారిటీలకు కూడా రాజ్యాధికా రం దఖలు పడడం ఎంతో దూరంలో లేదనేది వాస్తవం. వాస్తవానికి అధికార పార్టీ నాయకురాలిగా.. మం త్రిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న విడదల రజనీ.. కనీసం మైనారిటీల హక్కులు, రాజ్యాధికారం.. పదవుల గురించి పన్నెత్తు మాటైనా మాట్లాడారా? అనేది కూడా.. మైనారిటీ వర్గాలు పరిశీలించుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా.. మైనారిటీలకు మేలు చేస్తామన్న మాధవిని భారీ మెజారిటీతో గెలిపించుకుని తమ కలలను సాకారం చేసుకునే అద్భుతమైన క్షణాలు వారి ముందే ఉండడం గమనార్హం.