గుడివాడ‌లో సామాన్యుడి గుండె చ‌ప్పుడు…. ఇప్పుడు వినిపిస్తోందే..!

స‌మాజంలో సామాన్యుల సంఖ్యే ఎక్కువ‌. అది నియంతృత్వ రాజ్య‌మైనా.. ప్ర‌జాస్వామ్య దేశ‌మైనా.. కూడా ఒక్క‌టే. సామాన్యులదే పెద్ద‌పాత్ర‌. అలాగే గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోనూ 80 శాతం మేర‌కు సామాన్యులే ఉన్నారు. కానీ, ఇప్ప‌టి వర‌కు గ‌డిచిన రెండు ద‌శాబ్దాలుగా వారికి నోరుంది. కానీ, నోట మాటే లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాష్టీకాల‌ను ప్ర‌శ్నించే, ఎదురు నిలిచే ధైర్యం కూడా లేదు. కనీసం త‌మ స‌మ‌స్య‌లు ఇవీ.. అని చెప్పుకోలేని దైన్య స్థితిలోనే వారు ఉన్నారు.

అయితే.. ఇప్పుడు రోజులు మారాయి. అప్ర‌క‌టిత నియంతృత్వం కొన‌సాగిన గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌రకు ఏం జ‌రిగినా (క్యాసినో, పందేలు, చీట్ల పేక‌లు) మౌనంగా భ‌విస్తూ వ‌చ్చిన వారికి టీడీపీ అభ్య‌ర్థి, సామాన్యుల పాలిట ప్ర‌తినిధిగా ముందుకు వ‌చ్చిన వెనిగండ్ల రాము.. కోటి ఆశ‌లు నింపుతున్నా రు. ఇంత త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు ఎవ‌రూ లేరు.. అని సామాన్యులు నిర్ణ‌యించుకున్న స‌మ‌యంలో తూర్పున ఉద‌యించిన సూర్యుడిలాగా.. వారి క‌ష్టాలు వినేందుకు నేనున్నానంటూ. ముందుకు వ‌చ్చారు.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గుడివాడ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము రోజుకు 15 గంటల సేపు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. వారు త‌న వ‌ద్ద‌కు రావ‌డం కాదు.. తానే వారి వ‌ద్ద‌కు వెళ్తున్నారు. సామాన్యుల‌ను ప‌ల‌క‌రించి.. భుజం త‌ట్టి.. నేనున్నానంటూ భ‌రోసా క‌ల్పిస్తున్నారు. దీంతో వారు త‌మ క‌ష్టాలు, క‌న్నీళ్ల‌ను వెనిగండ్ల‌కు చెప్పుకొంటున్నారు. గ‌డిచిన రెండు ద‌శాబ్దాలుగా తాము ఎలాంటి ప‌రిస్థితిలో మ‌గ్గిపోయామో.. చెప్పుకొని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.

`నోరు ఎత్తాలంటే భ‌యం. ఎక్క‌డిక‌క్క‌డ నిఘా. ఏ చిన్న మాట అన్నా.. దౌర్జ‌న్యం. దాడులు. ఇంక మా క‌ష్టాలు ఎవ‌రికి చెప్పుకోవాలి. ఏం చెప్ప‌డానికి వీల్లేని ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితి మారాల‌ని మేం కోరుకున్నాం. క‌నీసం మాకు ధైర్యంగా జీవించే ప‌రిస్థితిని తీసుకురావాల‌ని కోరుకుంటున్నాం` అని మెజారిటీ సామాన్యులు వెనిగండ్ల ముందు బోరుమంటున్నారు. వారి క‌ష్టాలు.. అనుభ‌విస్తున్న న‌ర‌కం వంటివాటిని విని వెనిగండ్ల మ‌న‌సు క‌రిగిపోతోంది.

ప్ర‌జాస్వామ్యంలో ఇలా కూడా జ‌రుగుతుందా? అని ఆయ‌నే ఆశ్చ‌ర్య పోయేలా ఇక్క‌డి క‌ష్టాలు ఉన్నాయ‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మార్పు కోరుకుంటున్న ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అండ‌గా ఉంటున్నారు. ఈ ప‌రిణామాలు చూసిన వారు.. గుడివాడ‌లో సామాన్యుల గుండెచ‌ప్పుడు.. ఇప్పుడు వినిపిస్తోంది! అని కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags: filmy news, filmy updates, heart beat, latest film updates, latest updates, popular news, social media, Star Heroine, telugu news, temple, tollywood news, trendy news, viral news