వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి.. వైసీపీ ప్రయోగాలకు దిగిన విషయం తెలిసిందే. నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పేర్కొంటూ.. 60 స్తానాల్లో అభ్యర్థులను మార్చింది. కొత్తవారికి ఛాన్స్ ఇస్తూ.. ఇప్పుడు ఉన్నవారిని వేరే చోటకు బదిలీ చేసింది. దీంతో సమూలంగా కీలక నియోజకవర్గా ల్లో మార్పులు అయితే జరిగిపోయాయి. కొత్తగా నియమించిన వారు నియోజకవర్గాల్లోనూ పర్యటనలు చేస్తున్నారు. అయితే.. ఇక్కడే వీరికి సరికొత్త సమస్యలు వస్తున్నాయి.
ఉదాహరణకు గోపాలపురం నియోజకవర్గంలో నియమితులైన మంత్రి తానేటి వనితకు తొలి దశలోనే సెగ తగిలింది. తమ సమస్యలను ఏకరువు పెడుతూ.. ఇక్కడ వైసీపీ నాయకులు 52 పేజీలతో కూడిన నివేదికను ఆమెకు ఇచ్చారు. వారం రోజుల్లో ఆయా సమస్యలపై ఏం చేస్తారో చెప్పాలని ఆమెకు డెడ్ లైన్ విధించారు. అయితే.. ఇప్పుడు వాటిని పరిష్కరించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఈ సమస్యల్లో.. రహదారులు.. ప్రాజెక్టులు కూడా ఉండడంతో మంత్రివిస్మయానికి గురయ్యారు.
ఇక, విజయవాడ సెంట్రల్‌లోనూ ఇదే పరిస్తితి ఏర్పడింది. వెస్ట్ నుంచితీసుకువ చ్చిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఇక్కడ నియమించారు. ఈయనకు ఇప్పటి వరకు కేడర్ నుంచి ఎలాంటి సహకారం లేదు. ఇప్పుడిప్పుడే.. నెమ్మదిగా ఆయన ఎమ్మెల్యే మల్లాది విష్ణును బుజ్జగిస్తున్నారు. అయితే.. గత ఎన్నికల సమయంలో విష్ణుకు ప్రచార ఖర్చు కింద తాము లక్షలకు లక్షలు డబ్బులు ఇచ్చామని.. ఆ డబ్బులు మీరు చెల్లించండని.. కార్పొరేట్లు 12 మంది సమన్వయకర్త.. వెల్లంపల్లికి మెమొరాండం ఇచ్చారు.
అంతేకాదు.. ఈ డబ్బుల విషయం తేల్చిన తర్వాత.. ప్రచారం విషయం పట్టించుకుంటామని తేల్చేశారు. ఇక, గుంటూరు వెస్ట్‌లోకి అడుగు పెట్టిన మంత్రి విడదల రజనీకి మరింత భిన్నమైన సమస్యలు ఎదుర య్యాయి. ఇక్కడ వైసీపీ కేడర్ కంటే.. టీడీపీ కేడర్ ఎక్కువగా ఉంది. వీరంతా.. తమకు న్యాయం చేయా లంటూ.. ఆమెను డిమాండ్ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత వైసీపీ మద్దతు దారు గిరి పక్షాన పనిచేశామని.. ఆయన తమకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని.. ఆ డబ్బులు చెల్లించాలని.. వీరు డిమాండ్ చేయడంతోపాటు.. వచ్చే ఎన్నికలకు సంబందించి కూడా ఎంత ఇవ్వాలో నిర్ణయించారు. ఇదంతా నాలుగు గోడల మధ్యే జరిగినా.. బయటకు వచ్చేసింది. ఇలా.. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలకు సమస్యలు పెరుగుతున్నాయి.