సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80-90వ దశకంలో అగ్ర హీరోయిన్గా తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపింది. రమ్యకృష్ణ భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. అదే సమయంలో రమ్యకృష్ణ తన కెరీర్ ఆరంభంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె చేసిన సినిమాలన్నీ సరిగ్గా ఆడక పోవడంతో ఆమెను ఐరన్ లెగ్ హీరోయిన్గా ముద్రవేశారు.
లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కంటే ముందే ఏఎన్నార్‌ను ట్రై చేసిందా… అప్పుడేమి జరిగిందంటే..
ఆ టైంలో ఆమె చేసిన సినిమాల్లో ఆమె నటన బాగున్నా సినిమా ఆడకపోవటంతో మంచి పేరు వచ్చేది కాదు. ఇలా తాను చేసిన సూత్రధారులు సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు మంచి పేరు వచ్చింది. అయినా కానీ సినిమా అయితే కమర్షియల్‌గా హిట్ అవ్వలేకపోయింది. ఇక ఆ సమయంలో రమ్యకృష్ణ నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని టాక్ జోరుగా ప్రచారం అయింది. రమ్యకృష్ణ ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్ల ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత అవి క్యాన్సిల్ చేసుకున్నారు.
శోభిత తో చైతన్య- డేటింగ్.. దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన సమంత.. అక్కినేని కుర్రాడి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో..?
అదే సమయంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ హీరో- హీరోయిన్లుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడుగారు సినిమా తీశారు. ఈ సినిమా మోహన్ బాబుకు, రమ్యకృష్ణకు తిరుగులేని సూపర్ హిట్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా ఆ టైంలోనే 75 కేంద్రాల్లో 100 రోజులు ఆడి మోహన్ బాబుకు తిరుగులేని స్టార్ డమ్ తీసుకొచ్చింది.
ఆ ఫొటో షేర్ చేసి తన పరువు తానే తీసుకున్న శ్రీముఖి… ఏం చేసిందో చూడండి…!
అదే సందర్భంలో రమ్యకృష్ణకి ఐరన్ లెగ్ అనే మార్క్ ఈ సినిమా ద్వారా ఆమె పోగొట్టుకుంది. ఇప్పటికి కూడా సినిమాలో నటిస్తు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బాహుబలి సినిమాల నుంచి రమ్యకృష్ణ కెరీర్ బాగా ఊపందుకుంది. ఇప్పుడు రమ్యకృష్ణ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే టాక్ కూడా ఉంది.
వామ్మో..మృణాల్ ఆ హీరో ని సాటిస్ఫై చేసిందా..? అందుకే తెలుగులో అవకాశాలు వస్తున్నాయా..?