ఆ ఫొటో షేర్ చేసి త‌న ప‌రువు తానే తీసుకున్న శ్రీముఖి… ఏం చేసిందో చూడండి…!

బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి అదుర్స్ టీవీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. బుల్లితెరపై ఎన్నో రకాల టీవీ షోలను చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. పటాస్ షో ద్వారా శ్రీముఖి బాగా ఫేమ్‌ సంపాదించుకుంది. శ్రీముఖి టీవీ షో లోనే కాక వెండితెరపై కొన్ని సినిమాల్లో కూడా నటించింది.

Anchor Sreemukhi : అచ్చం రవితేజలాగే ఉన్న శ్రీముఖి ఫాదర్.. పిక్స్ వైరల్..  Anchor Sreemukhi father looks like actor ravi teja see pics here– News18  Telugu

ఈమె టీవీ షోలో యాంకరింగ్ చేస్తూ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తు.. ఏ షో చేసినా చాలా యాక్టివ్ గా ఉండడంతో ఆమెకు ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు వచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటిస్టెంట్‌గా వెళ్లి చివరి వరకు సత్తా చాటి బాగా అభిమానుల‌ను సంపాదించుకుంది. ఈ షోలో చివరి వరకు ఉండి రన్నర‌ఫ్ అయ్యింది. ఎప్పుడూ హాట్ ఫోటోషూట్లే కాకుండా అప్పుడప్పుడు సాంప్రదాయ దుస్తులతో షాకులు ఇస్తూ ఉంటుంది.

శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఫన్నీ వీడియోల‌తో పాటు తన అనుభవాలూ షేర్ చేసుకుంటూ ఉంటుంది. శ్రీముఖికి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అప్పుడప్పుడు శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా తన ఫాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఫన్నీ కామెంట్స్, జోక్స్ తో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సిగ్గుపడకుండా సమాధానం చెబుతూ ఉంటుంది.

Anchor Sreemukhi Ugadi Photos | Anchor Sreemukhi: శ్రీముఖి ఉగాది సందడి -  చీరలో చక్కగా ముస్తాబైన రాములమ్మ

ఇటీవల శ్రీముఖి ఉగాది సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఉగాది పచ్చడి తింటున్న ఒక ఫోటో షేర్ చేసింది. ఉగాది పచ్చడి ఏదో చిన్న బౌల్ లో కాకుండా పాయసం పెట్టుకున్నట్టు పెద్ద గిన్నెలో పెట్టుకొని తినడంతో నెటిజన్లు ఉగాది పచ్చడి తింటున్నావా ? లేక పాయసం తింటున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఉగాది పచ్చడి తినే ఫోటో తెగ వైరల్ అవుతుంది.

Tags: anchor srimuki, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, srimuki, star acttress\, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news