బిగ్‌బాస్ – 8 లో వేణు స్వామి.. కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. టైటిల్ విజేత ముందే చెప్పేస్తారా..?

బిగ్ బాస్ రియాలిటీ షో.. ఈ షో ఇప్పటికే హిందీ, కన్నడ,తమిళ,తెలుగు భాషల్లో మంచి ప్రాధాన్యం సంతరించుకుంది. హిందీలో ఇప్పటికే ఎన్నో సీజన్లు కూడా పూర్తి చేసుకుంది. అయితే అలాంటి బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 నడుస్తోంది. ఇప్పటికే సీజన్ 7 ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో సీజన్ సెవెన్ విషయంలో ఎన్నో విమర్శలను మూటకట్టుకుంది. అయితే ఈ షో తెలుగు లో స్టార్ట్ అయినప్పటి నుండి చాలామంది ఈ షో ని రన్ చేయకూడదని,దీన్ని రద్దు చేయాలని ఎన్ని గొడవలు చేసినా కూడా దీన్ని ఆపలేకపోతున్నారు. కోర్టులో ఎన్నిసార్లు కేసు వేసినా కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆపడం లేదు.అయితే అలాంటి బిగ్ బాస్ 8 సీజన్ త్వరలోనే ప్రారంభమవబోతుంది.

అయితే సీజన్ 7 లో చాలా రసవత్తరంగా సాగింది కాబట్టి సీజన్ 8 పై ఎంతోమంది అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే సీజన్ 8లో చాలామంది పాపులర్ అయిన వారిని తీసుకురావాలని చూస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామిని ఈ రియాల్టీ షో కి కంటెస్టెంట్ గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.. ఇక బిగ్ బాస్ షో మొదలవుతుంది అంటే దాని గురించి ఎన్నో రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అని కొంతమంది సెలబ్రిటీల పేర్లు ముందుగానే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు.

అలా త్వరలో స్టార్ట్ అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8లో కుమారి ఆంటీ, బర్రెలక్క వంటి వారితో పాటు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వేణు స్వామి ఈ మధ్యకాలంలో జ్యోతిష్యాలు చెప్పడం మానేస్తాను అని ఓ వీడియో చేశారు. ఎందుకంటే ఏపీలో జగన్ గెలుస్తారని జ్యోతిష్యం చెప్పారు. కానీ ఆయన జ్యోతిష్యం బెడిసి కొట్టింది. అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యారు. దాంతో తన జ్యోతిష్యం తప్పడంతో ఇకనుండి జ్యోతిషాలు ఎక్కడా చెప్పను అని, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వనని,రాజకీయ సినీ ప్రముఖులకు సంబంధించిన జ్యోతిష్యాలు బహిరంగంగా ఎక్కడా చెప్పనని కూడా ఆ వీడియో ద్వారా చెప్పారు.

అయితే ఈయన ఇంటర్వ్యూలు ఇస్తూ జ్యోతిష్యం చెప్పకపోయినప్పటికీ ఈయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఈయనకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో కంటెస్టెంట్ గా తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే మొదట్లో ఈయన రావడానికి కాస్త ఆలోచించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ పాపులారిటీ కోసం ఈ షో తనకి ఉపయోగపడుతుంది అని ఒప్పుకున్నారట. అంతేకాకుండా ఈ షో రావడం కోసం భారీగా రెమ్యూనరేషన్ ని కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ముందుగా అంత రెమ్యూనరేషన్ మేము ఇచ్చుకోలేము అని, ఇప్పటివరకు ఏ పెద్ద సెలబ్రిటీకి కూడా అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పారట.

కానీ ఆ తర్వాత మళ్లీ బాగా ఆలోచించి వేణు స్వామి అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట. అయితే ప్రస్తుతం ఈ మ్యాటర్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ బిగ్ బాస్ 8 లోకి వేణు స్వామి వస్తే సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరో ముందుగానే చెప్పేస్తారు కావచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల భవిష్యత్తు చెప్పేసారు కాబట్టి ఇది కూడా చెప్పేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి బిగ్ బాస్ లోకి వేణు స్వామి రాబోతున్నాడు అనే రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది