మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై వైసీపీ మ‌హిళా ఎంపీ క‌న్ను.. వామ్మో మామూలు గేమ్ కాదుగా..!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక‌రురెబ‌ల్ కాగా, 21 మంది ఉన్నారు. అయితే.. వీరిలో కొంద‌రు అసెంబ్లీపై దృష్టి పెట్టారు. దీనికి కార‌ణం.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ఏడు లేదా ఆరు సెగ్మెంట్ల‌లో ఆశించిన విధంగా ప‌రిస్థితి లేక‌పోవ‌డమే. మొత్తంగా మ‌రోసారి ఎంపీగా పోటీ చేసి చేతులు కాల్చుకునే క‌న్నా.. అసెంబ్లీ వైపు దృష్టి పెడితే.. ఉభ‌య కుశ‌లోప‌రిగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అంటే.. ఖ‌ర్చుకు ఖ‌ర్చు త‌గ్గుతుంది.

Amalapuram Ysrcp MP Candidate Chinta Anuradha mother dies - Sakshi

పైగా గెలుపు గుర్రం ఎక్కితే రేపు మ‌రోసారి వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే.. మంత్రి గా ఛాన్స్ కొట్టేయొచ్చ‌నే ఆలోచ‌నతో కొంద‌రు ఉన్నారు. ఇలా.. 8 నుంచి 10 మంది ఎంపీలు అసెంబ్లీ సీటు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలాంటి వారిలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న పేరు చింతా అనురాధ‌. ప్ర‌స్తుతం ఈమె ఎస్సీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం అమ‌లాపురం నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ పార్ల‌మెంటు ప‌రిధిలోని అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైసీపీ ప‌రిస్థితి గ‌త ఎన్నిక‌ల‌కు ముందున్న ట్టుగా అయితే లేదు. కొత్త జిల్లా ఏర్పాటు.. దానికి పెట్టిన పేరు వంటివాటితో విభేదిస్తున్న‌వారు.. ఎస్సీల‌పై కేసులు పెట్ట‌డంతో దూర‌మైన వ‌ర్గాలు వంటివి కొంత ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. దీంతో ఎంపీ చింతా అనురాధ కొంతకాలం నుంచి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇక్కడ పలు కార్యక్రమాలకు హాజర‌య్యారు.

అంతేకాదు.. ఎంపీ లాడ్స్ నిధుల‌తో ర‌హ‌దారులు కూడా వేయించారు. అదేవిధంగా రాజోలులో కేంద్రీయ విద్యాల‌యాన్ని తీసుకు వ‌స్తానని కూడా త‌న అనుచ‌రుల ద్వారా హామీలు గుప్పించారు. అయితే.. ఇక్క‌డ జ‌న‌సేన నుంచి గెలిచిన రాపాక‌ వ‌ర‌ప్ర‌సాద్‌.. ఆమెపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డంతో అనురాధ .. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విర‌మించు కున్నారు.

ఇటీవ‌ల కాలంలో పి.గ‌న్న‌వ‌రం, అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్టారు. ఇక్క‌డ కూడా ఆమెకు స్థానిక‌నేత‌ల నుంచి కొంత వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అయితే.. పి. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. కొన్నాళ్లుగా పార్టీపై అసంతృప్తితో ఉండ‌డం.. కార్య‌క్ర‌మాల్లోనూ పెద్ద‌గా మ‌న‌సు పెట్టి పార్టిసిపేట్ చేయ‌క‌పోవ‌డం వంటివి అనురాధ‌కు క‌లిసి వ‌స్తోంది.

అదే అమ‌లాపురం అయితే.. మంత్రి పినిపే విశ్వ‌రూప్ పైకి బాగానేఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న అనుచ‌రుల ద్వారా.. ఎంపీకి వ్య‌తిరేకంగా కామెంట్లు చేయిస్తున్నారు. దీంతో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టిపెట్టిన అనురాధ‌.. పి. గ‌న్న‌వ‌రంపై ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రి పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp