వావ్‌: తెలంగాణలో న‌యాగారా జ‌ల‌పాతం చూస్తారా ( వీడియో)

ప్ర‌పంచంలోనే అత్యంత సుంద‌ర‌మైన జ‌ల‌పాతం ఏదంటే న‌యాగారా జ‌ల‌పాతాన్ని మ‌నం చెపుతాం. అయితే మ‌న తెలంగాణ‌లోనూ అంత‌కు మించిన సుంద‌ర జ‌ల‌పాతాలు ఉన్నాయి. తెలంగాణ‌లో కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌కు ఎన్నెన్నో కొత్త జ‌ల‌పాతాలు ప‌ట్టుకు వ‌స్తున్నాయి. ఇవి చూప‌రుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

తాజాగా తెలంగాణ‌లోని ములుగు జిల్లాలో ముత్యంధార జ‌ల‌పాతం ప‌ర్యాట‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. వెంకటాపురం మండల పరిధిలోగల వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యంధార జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 700 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పడుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. కొంద‌రు అయితే దీనిని ముద్దుగా తెలంగాణ న‌యాగార అని పిలుచుకుంటున్నారు.