నోయిడాలో కార్లు కొట్టుకుపోతున్నాయా… వంద‌ల సంఖ్య‌లో మునిగిపోయాయ్ ( వీడియో)

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా వాన భీభ‌త్సం చేస్తోంది. ఏపీ, తెలంగాణ‌లో మాత్ర‌మే కాదు కోస్తా తీరంలో అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ వాన‌ల జోరుకు ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డేలా లేవు. అటు నార్త్‌లో కూడా వ‌ర్షాల జోరు మామూలుగా లేదు. ఈ క్ర‌మంలోనే యూపీల‌ని నోయిడాలో భారీ వ‌ర్షాల‌కు ఒకే చోట ఉన్న కార్లు అన్ని పూర్తిగా మునిగిపోయాయి.

కేవ‌లం కార్ల పై క‌ప్పు మాత్ర‌మే క‌నిపిస్తోంది. ఒకే చోట వంద‌ల సంఖ్య‌లో ఉన్న కార్లు మునిగిపోయి ఉన్నాయి. వ‌ర‌ద మరికాస్త ఎక్కువ అయితే ఈ కార్లు కొట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌న్నట్టుగా నెటిజ‌న్లు కామెంట్లు చేస్త‌న్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.