వరుణ్ తేజ్‌ కంటే ముందే లావణ్య త్రిపాఠి ప్రేమించిన హీరో ఎవ‌రంటే…!

టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావణ్య త్రిపాఠి ఒకరు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు.

Mister Telugu Movie Review | Varun Tej Mister Movie Review | 123telugu.com

మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ దూసుకుపోతున్న లావణ్యపై మెగా వారసుడు వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ హల్ చల్ చేశాయి. తాజాగా లావణ్య త్రిపాఠిపై మరో న్యూస్ వైరల్‌గా మారింది. లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ కంటే ముందే మరో హీరోతో ప్రేమలో పడిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసి మూవీలో హీరోగా నటించిన నవీన్ చంద్ర.

ఈ సినిమాలో నవీన్- లావణ్య మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరు ప్రేమాయణం నడిపార‌ని… బ‌య‌ట కూడా చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేవారంటూ అప్పట్లో వార్తలు గట్టిగా వినిపించాయి. అదే సమయంలో నవీన్ చంద్రకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదని… ఆస్తులు కూడా లేవ లావణ్య- నవీన్ కు హ్యాండ్ ఇచ్చేసిందంటారు.

Watch Andala Rakshasi | Netflix

ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్‌కు బాగా దగ్గరయింది. వ‌రుణ్‌తేజ్‌తో అంత‌రిక్షం, మిస్ట‌ర్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే వీరి స్నేహం ప్రేమ‌గా మారేవ‌ర‌కు వెళ్లింది. చివ‌ర‌కు వ‌రుణ్ చెల్లి నిహారిక పెళ్లిలో లావ‌ణ్యే బాగా హైలెట్ అయ్యింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మాత్రం వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీగాా ఉందంటూ ఇప్పటికి ఎన్నో వార్త‌లు వస్తూనే ఉన్నాయి. మ‌రీ వాటిలో నిజం ఎంతుందో వారికేే తెలియాలి.