మ‌హానాడులో లోకేష్ సింప్లిసిటీ… కేడ‌ర్ అంతా ఫిదా….!

రాజ‌మండ్రి వేదిక‌గా.. తెలుగు దేశ పార్టీ నిర్వ‌హిస్తున్న మ‌హానాడు ఉర్రూత‌లూగుతోంది. మ‌హానాడు తొలి రోజు శ‌నివారం.. భారీ ఎత్తున యువ‌త త‌ర‌లివ‌చ్చారు. నియోజ‌వ‌క‌ర్గాల వారీగా నాయ‌కులు త‌మ స‌త్తా చాటుకున్నారు. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశిస్తున్న‌వారుఈ జాబితాలో ముందున్నారు. దీంతో మ‌హానాడులో భారీ ఎత్తున యువ‌త క‌నిపించ‌డం విశేషం. అయితే.. ఇదేస‌మ‌యంలో మ‌రో ప్ర‌త్యేక‌తా క‌నిపించింది.

Lokesh demands YSRCP MLA Raja's arrest

పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కు యువ‌త బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆయ‌న‌కు అడుగడుగునా.. స్వాగ‌తం ప‌లికారు. తొలుత‌.. అసలు నారా లోకేష్ ప్రాంగణానికి వ‌చ్చేముందు.. పూలు ప‌రిచి దానిపై న‌డిపించాల‌ని అనుకున్నారు. దీనికి యువ‌త స‌మాయ‌త్త‌మ‌య్యారు. అయితే.. ఎందుకైనా మంచిద‌ని నారా లోకేష్‌కు సీనియ‌ర్ నేత‌లు స‌మాచారం ఇచ్చారు. దీంతో లోకేష్ ఇలాంటివి వ‌ద్దు.. అని సున్నితంగా తిర‌స్క‌రించారు.

ఇక‌, స‌భ‌లోనూ.. నారా లోకేష్ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. నిజానికి పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కాబ‌ట్టి.. ఆయ‌న వేదిక‌పై తొలి వ‌రుస‌లోనే కూర్చుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. అందుకే ఒక‌సీటును కూడా రిజ‌ర్వ్ చేశారు. దానిపై పేరు రాయ‌క‌పోయినా.. చిన్న‌బాబు కోసమ‌ని నిర్వాహ‌కులు అట్టే పెట్టారు. కానీ, నారా లోకేష్‌.. ఆ వ‌రుసలో కాకుండా.. వెళ్లి వెళ్లి.. నాలుగో వ‌రుస‌లో కూర్చున్నారు.

Nara Lokesh Speech At Mahanadu | Nara Lokesh Speech At Mahanadu: కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగం | ABP Desam

సీనియ‌ర్లంద‌రూ.. తొలి వ‌రుస‌లో కూర్చోగా.. నారా లోకేష్ మాత్రం నాలుగో వ‌రుస‌లో కూర్చోవ‌డం గ‌మ‌నా ర్హం. ఇది ఆయ‌న‌లో ఉన్న సింప్లిసిటీ.. పెద్ద‌ల‌ప‌ట్ల ఉన్న గౌర‌వాన్ని సూచిస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిం చారు. అంతేకాదు.. భోజ‌నాల ద‌గ్గ‌ర కూడా.. నారా లోకేష్‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసినా.. లోకేష్ మాత్రం.. అంద‌రితోనూ క‌లిసి భోజనం చేశారు. ఇక‌, యువ‌త ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు.. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ ప‌డిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.