కూతురు వ‌య‌సున్న హీరోయిన్‌ ఫాతిమాతో క‌లిసి ఆ ప‌ని చేస్తూ అడ్డంగా బుక్ అయిన అమీర్ (వీడియో)

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా చాలా కామన్. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు మనం ఎన్నో చూసాం. ప్రేమలో చాలాకాలం మునిగి తేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. కొందరు స్టార్ హీరోలు సైతం రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. మిస్టర్ పర్‌ఫెక్ట్‌నిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

భారీ అంచనాల మధ్య నటించిన లాల్‌సింగ్ చ‌ద్దా డిజాస్టర్ కావడంతో అమీర్ ఖాన్ సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఎప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని మాజీ భార్యలకు విడాకులు ఇచ్చేసిన అమీర్ ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దంగల్ సినిమాలో అమీర్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో అమీర్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇద్దరు చట్టా పట్టాలేసుకొని చాలాసార్లు ఇప్పటికే బాలీవుడ్ మీడియా కంటపడ్డారు. ఇటీవల అమీర్ కూతురు ఇరాకాన్ ఎంగేజ్మెంట్ వేడుకలోను ఫాతిమా సందడి చేసింది. తాజాగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఆడుతున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారడంతో మరోసారి డేటింగ్ వార్తలు హాట్‌ టాపిక్గా మారాయి.

 

ఇక ఈ వీడియో బయటకు వచ్చాక వీరిద్దరూ కలిసే ఉంటున్నట్టు ఉన్న అనుమానాలకు మరింత బలం వచ్చినట్లయ్యింది. 1986 లో రీనా ద‌త్తాను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కిరణ్ రావ్‌ను 2005 లో పెళ్లి చేసుకోగా 2021 లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు త‌న కూతురు వ‌య‌స్సు పాతిమాతో మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడు.