పిల్ల‌లు లేని శరత్ బాబు ఆస్తులకు వారసులు ఎవరు.. సోదరి సరిత సెన్సేషనల్ కామెంట్స్..!

సీనియర్ నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇటీవల ఒక ప్రైవేట్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ ఆయ‌న మరణించారు. సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు వివాహ జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇక‌ శరత్ బాబుకు సంతానం లేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరత్‌బాబు మృతి తర్వాత ఆయన ఆస్తులు ఎవరికి ? చెందుతాయి అనే విషయంపై వార్తలు జోరుగా సాగుతున్నాయి.

Sarath Babu Wiki, Age, Death, Wife, Family, Biography & More - WikiBio

ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్ శరత్ బాబు చిన్న చెల్లి స‌రిత‌ను ఇంటర్వ్యూ చేయగా ఆమె తన అన్నయ్య గురించి.. వారి మధ్య అనుబంధం గురించి తెలుపుతూ ఎమోషనల్ అయింది. అన్నయ్యే తనకు అమ్మా, నాన్న అని.. తనకు ఎప్పుడు ఏ విషయంలోనూ ఎలాంటి లోటు చేయలేదని.. త‌న పెళ్లి కూడా ఆయనే చేశాడని చెప్పుకొచ్చింది సరిత. తన కొడుకుని ఆయన చదివిస్తున్నాడని… కుమార్తె సోనియా పెళ్లి కూడా శరత్ బాబు చేశాడని వెల్లడించింది.

చివరిసారిగా తన కుమార్తె డెలివరీ అయిన‌ప్పుడు వచ్చిన శరత్ బాబు… ఆ తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని చెప్పుకొచ్చింది. త‌న‌ను ఎప్పుడూ చెల్లిగా కాకుండా.. కూతురుగా శరత్ బాబు చూసుకునే వారిని… అలాగే తన కూతురు సోనియా అంటే కూడా శరత్ బాబుకి చాలా ఇష్టమని కొన్ని సందర్భాల్లో సోనియను దత్తత తీసుకోవాలని భావించారని.. అయితే అది కుదరలేదని సరిత చెప్పుకొచ్చింది.

Sarath Babu blasts Rama Prabha for cheating accusation: I was born with a silver spoon

చాలా సందర్భాల్లో సోనియాను దత్తత తీసుకుందాం అనుకున్నార‌ట‌ శరత్ బాబు. అయితే ఇప్పుడు ఆయ‌న‌ ఆస్తికి వారసులు ఎవరు ? అనుకుంటున్నారు అని సరితను అడగా దాని గురించి నాకు ఏమీ తెలియదని.. కేవలం శరత్ బాబు మాపై చూపించిన ప్రేమ తప్ప అటువంటి ఆస్తుల వివరాలను నాకు తెలియవు అంటూ చెప్పుకొచ్చింది సరిత.