రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఏకైక‌ సినిమా ఇదే…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడిగా చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఆ త‌ర్వాత వ‌రుస సినిమ‌లు చేసుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోగా మ‌రాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్‏గా భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చరణ్. ఈమూవీతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

50 Rare & Unseen Photos Of Mega Power Star Ram Charan - Chai Bisket

హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల‌లో న‌టించినా చెర్రీ.. చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఓ సినిమాలో కనిపించారట. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే చరణ్ బాలనటుడిగా ఓ సినిమాలో నటించారట. చిన్నప్పుడు ఎంతో క్యూట్‏గా ఉండే చరణ్ అప్పుడే వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.

కానీ ఆ సినిమాలోని చరణ్ సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందట. చిరంజీవి హీరోగా నటించిచన లంకేశ్వరుడు సినిమాలో చరణ్ ఓ సన్నివేశంలో నటించారట. దాసరి నారాయణరావు, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక్క‌ సినిమా ఇది. ఇది దాస‌రికి కెరీర్ ప‌రంగా 100వ సినిమా. ఇందులో చరణ్ ఓ సీన్‌లో నటించాడు. తండ్రితో పాటు ఉన్న వర్కింగ్ స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.

Ram Charan on completing 13 years in Tollywood: I've cherished every bit of it | Telugu Movie News - Times of India

అయితే సినిమా అంతా అయిపోయాక‌ ఎడిటింగ్ టేబుల్ మీద చూసుకుంటే అతికించినట్లు ఉండటంతో ఆ సన్నివేశం తీసేసారు దర్శకుడు దాసరి. ఆ సీన్ అలాగే ఉంచి ఉంటే రామ్ చరణ్ తొలి సినిమా లంకేశ్వరుడు అయ్యుండేది. ఆ తర్వాత ఇంకెప్పుడు బాల నటుడిగా చరణ్ నటించలేదు. 21 ఏళ్ళ వయసులో చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రామ్ చరణ్.. ఆ తర్వాత అప్రతహతంగా దూసుకుపోతున్నాడు.