న‌టుడు శ‌ర‌త్‌బాబు ఎక్క‌డి వారు… ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాడు తెలుగు స్టార్ హీరో ఎలా అయ్యాడు…!

సీనియ‌ర్ న‌టుడు శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. తెలుగ‌, త‌మిళ సినిమాతో ఆయ‌న బంధం పెన‌వేసుకుని ఉంది. ఇక శ‌ర‌త్‌బాబు పుట్టింది ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల‌వ‌ల‌స‌. ఆయ‌న చ‌దువులో ఉన్న‌ప్పుడు మిత్రులు, లెక్చ‌ర‌ర్స్ చాలా అందంగా ఉంటావు… నువ్వు హీరోకు స‌రిగ్గా స‌రిపోతావు.. సినిమాల్లోకి వెళ్లి హీరోగా ట్రై చేయ‌వ‌చ్చు క‌దా ? అని ప్రోత్స‌హించేవారు.

Rumors about actor Sarathbabu – family condemned

అయితే వాళ్ల తండ్రికి సినిమాలు అంటే ఇష్టం ఉండేదే కాదు. వాళ్ల‌కు ఉన్న ఓ పెద్ద హోట‌ల్‌ను చూసుకోవాల‌ని శ‌ర‌త్‌బాబును తండ్రి కోరారు. అయితే త‌ల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో శ‌ర‌త్‌బాబు చెన్నై వెళ్లి అక్క‌డ సినిమాల్లో స‌క్సెస్ అయ్యారు. అయితే శ‌ర‌త్‌బాబు తెలుగు వ్య‌క్తి అయినా త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్టార్ హీరోగా స‌క్సెస్ అయ్యారు.

శ‌ర‌త్‌బాబు తెలుగు వ్య‌క్తి అని చాలా మంది అనుకుంటారు. అయితే ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టారు. శరత్ బాబు కుటుంబం 1950 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు తరలివచ్చింది. శరత్ బాబుది చాలా పెద్ద కుటుంబం. ఆయ‌న‌కు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు కావ‌డం విశేషం.

Sarath Babu to join politics? | Telugu Movie News - Times of India

శ‌ర‌త్‌బాబు అస‌లు పేరు సత్యన్నారాయణ దీక్షితులు. ఇక సినిమాల్లోకి వ‌చ్చాక శ‌ర‌త్‌బాబు ఏకంగా 5 ద‌శాబ్దాల‌కు పైగా ఎన్నో భాష‌ల్లో కొన్ని వంద‌ల సినిమాల్లో న‌టించారు. 1980 టైంలో ఆయ‌న కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే ఏకంగా మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఆయ‌న విల‌న్‌గా న‌టించారు.