వ‌య‌స్సులో పెద్ద‌దైన ర‌మాప్ర‌భ‌ను శ‌ర‌త్‌బాబు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు.. వీరి ప్రేమ‌కు కార‌ణం ఎవ‌రు ?

సీనియర్ నటుడు శరత్ బాబు ( 71 ) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. శరత్ బాబు తెలుగు వ్యక్తి అయినా కూడా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించారు. శరత్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మెప్పించారు.

Sarath Babu responds on Rama Prabha's comments

నటుడుగా ఎంతో సక్సెస్ అయిన శరత్ బాబు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడే ఆయన అప్పటికే తనకంటే సీనియర్ వయసులో పెద్దది అయినా రమాప్రభను వివాహం చేసుకున్నారు. అప్పటికే రమాప్రభ స్టార్ హీరోయిన్గా.. స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శరత్ బాబుతో పోలిస్తే రమాప్రభ వయసులో ఐదు సంవత్సరాలు పెద్దది. అయితే వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం.

15 ఏళ్ల పాటు కాపురం చేసిన ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ తమిళనాడు న‌టుడు నంబియార్‌ కుమార్తె స్నేహను శరత్ బాబు రెండో వివాహం చేసుకున్నా వారిద్దరు కూడా విడిపోవలసి వచ్చింది. ఇక తనకంటే వయసులో పెద్దది అయినా రమాప్రభను శరత్ బాబు ఎందుకు ? పెళ్లి చేసుకున్నారు. అసలు వీరిద్దరి ప్రేమ ఎలా ? చిగురించింది అన్నది ఆసక్తికరమే.

Sarath Babu blasts Rama Prabha for cheating accusation: I was born with a  silver spoon

రమాప్రభమే మొదట శరత్ బాబును ప్రేమించింది. ఇటు శరత్ బాబు అప్పుడప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నారు. ఇందుకు రమాప్రభ కూడా సాయం చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య సానిహిత్యం ఏర్పడింది. వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ శరత్ బాబును హీరోగా నిలబెట్టడం కోసం చాలా సాయం చేసిందని ఇండస్ట్రీ జనాలు చెబుతారు. అయితే నటుడుగా శరత్ బాబు బిజీగా ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దాంతో విడిపోయారు.

ఇప్పటికీ రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబును తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది. కేవలం తన అవసరాల కోసం శరత్ బాబు తనని వాడుకుని తన ఆస్తి అంతా లాక్కున్నాడని కూడా ఆమె ఘాటుగా విమర్శలు చేస్తూ ఉంటారు. వాస్తవాలు ఏమి అయినా.. వీరిద్దరి ప్రేమ, పెళ్లి విడాకులు అప్పట్లో ఓ సంచలనంగా మిగిలిపోయింది.