ఈ చిన్నారి ఒకప్పటి స్టార్ హీరోయిన్… స్టార్ హీరోల క‌ల‌ల రాకుమారి కూడా…!

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో చాలామంది స్టార్ హీరో ,హీరోయిన్లు వారి వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాల అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలామంది స్టార్ హీరోయిన్లు వారి హాట్ ఫోటో షూట్లతో పాటు తమ చైల్డ్‌హుడ్ ఫోటోలను త్రో బ్యాక్ పిక్చర్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ చిన్నారి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఆమె నవ్వుకు, అందానికి, అభినయానికి కోట్లాదిమంది ప్రేక్షకులు ఉన్నారు.

ఆమె తెలుగులోనే కాక తమిళ ,మలయాళ భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలు అందరితో నటించిన ఈమె.. తన నవ్వుతోనే చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాలు సాంప్రదాయ పాత్ర‌ల్లోనే నటించింది. చాలా మంది కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిన్నారి ఎవరో కాదు స్నేహా.

Radha Gopalam Full Movie Online In HD on Hotstar

గోపీచంద్ హీరోగా ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా… ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనదైన స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం, సంక్రాంతి, వెంకీ వంటి హిట్ సినిమాల్లో నటించింది.

Telugu couple star Sneha and Prasanna are getting divorce? Here's what we know

అప్ప‌ట్లో సంప్ర‌దాయ పాత్ర‌ల‌కు స్నేహ పెట్టింది పేరు కావ‌డంతో ఎంతోమంది హీరోలు స్నేహ‌తో న‌టించేందుకు ఇష్ట‌ప‌డేవారు. 2012లో తమిళ్ హీరో ప్రసన్న కూమార్ ని వివాహం చేసుకున్న స్నేహ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కాగా ప్రస్తుతం స్నేహ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.