వాట్..ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుని వెళ్లిపోతే అల్లు అర్జున్ అంతలా బాధపడ్డారా..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకరుగా నిలిచారు. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో తన నటనతో మేనరిజంతో బాలీవుడ్ ప్రేక్షకుల సైతం మెప్పించాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

تويتر \ Team Allu Arjun Army على تويتر: "Started his Journey as hero in Gangotri Which resulted super hit in Telugu 👌 50 Days in 107 Centres 100 Days in 54 Centres (

ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించక ముందే మరో స్టార్ హీరోని ఎంతో పిచ్చిగా ప్రేమించారట. ఇక మరి ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు మిస్ వరల్డ్ గా నిలిచిన మాజీ ప్రపంచ చందరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్. అల్లు అర్జున్ ఐశ్వర్యరాయ్ ఎప్పుడైతే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి పరిచయమైందో అప్పటినుంచి తనకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయిందట.

Profil Aishwarya Rai, Bermula dari Miss India Lalu Bintangi 40 Judul Film Bollywood dan Hollywood - Seleb Tempo.co

అదే సమయంలో హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఐశ్వర్యరాయ్ ఎప్పుడైతే అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకుందో ఆ సమయంలో అల్లు అర్జున్ ఎంతో బాధ పడ్డారట. ఇదే విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను ఇష్టమైన అమ్మాయిలు ఎంతలా ఏడ్చారో అంతకంటే ఎక్కువగా నేను ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకున్నప్పుడు బాధపడ్డాను అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.