ఉపాసన తన కూతురు బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేసారో తెలుసా..? ఎంత ఖర్చు అవుతుందంటే..?

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా మనవరాలు పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అందరికి తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రీసెంట్ గానే ఓ పాప పుట్టింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శుభవార్త ఎట్టకేలకు మెగా కుటుంబం వారికి అందించింది. మెగా కోడలు ఉపాసన మహాలక్ష్మి లాంటి పాపకు జన్మనిచ్చింది. ఈనెల 20వ తేదీన తెల్లవారుజామున మెగా కుటుంబంలో మహాలక్ష్మి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారుతూ వస్తున్నాయి.

Ram Charan's wife Upasana embraces the beauty of pregnancy in style |  PINKVILLA

ఇప్పుడు తాజాగా రామ్‌చరణ్ ఉపాసనకు పుట్టిన బిడ్డ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. వారికి పుట్టిన పాప బొడ్డుతాడు రక్తాన్ని ఓ ప్రైవేట్ సంస్థ వద్ద సేఫ్‌గా దాచి పెట్టినట్లు ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇకపోతే రక్తం దాచిపెట్టడం అంటే.. అంబిలికల్ కార్డ్ బ్లడ్ అని అర్థం. అయితే ఇప్పుడు ఈ బొడ్డుతాడు రక్తం దాచటం గురించి తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నా బిడ్డ బొడ్డును ప్లసెంటా తో బొడ్డుతాడు క‌లుపుతుంది. ఇక దీని ద్వారానే త‌ల్లి క‌డుపులో ఉన్నా బిడ్డకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ వెళ్తాయి. ఇక‌ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చినప్పటికీ.. బొడ్డుతాడు ద్వారా బిడ్డ ప్లసేంటా కు అనుసంధానమై ఉంటుంది.

ఇక పూట్టిన బిడ్డకు ప్లసెంటా నుంచి వేరు చేయడానికి ఈ బొడ్డుతాడును కత్తిరించి ముడి వేస్తారు. దీన్నే అంబిలికల్ కార్డు క్లిప్పింగ్ అని అంటారు. ఆ ముడి తీసిన త‌ర్వాత బిడ్డ బొడ్డుకు క‌లిసి ఉండే మిగిలిన చిన్న బొడ్డు తాడు.. ఐదు లేదా 15 రోజుల్లో ఎండిపోయి నల్లగా మారి ఊడిపోతుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆ బొడ్డుతాడు, ప్లసెంటా లోని మూల కణాలను దాచి పట్టడం కార్డు బ్లడ్ బ్యాంకింగ్ అని అంటారు. ఇక ఈ కణాలను లుకేమియా, తలెమియా, మాయ లోమాస్, లింపోమా లాంటి వ్యాధులను వచ్చినప్పుడు ఇది ఉపయోగిస్తే తొలగిస్తుందట.

Ram Charan's Wife Upasana On Raising Her Child: "Will Be Allowed The  Freedom To Be Themselves But..."

అదే సమయంలో ఒక్కసారి బొడ్డుతాడును ప్లసెంటాల నుంచి రక్తాన్ని తీసుకున్న తర్వాత దాన్ని వీలైనంత త్వరగా లేబరేటరీలకు తరలిస్తారు. బొడ్డు తాడు లోని రక్తాన్ని దాచేందుకు ఒక్కో సంస్థ ఒక్కో విధంగా డబ్బులు తీసుకుంటుంది. 20 సంవత్సరాలు దాచడానికి సాధారణంగా ఒక్కో సంస్థ 25000 వేల నుంచి 50 వేల డబ్బులు తీసుకుంటారట. అదేవిధంగా 75 సంవత్సరాల అయితే ఏకంగా 70000 వసూలు చేస్తారట.