చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఎలా వచ్చింది..? దీని వెనక ఇంత స్టోరీ నడిచిందా..!

చిత్ర పరిశ్రమకు ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్‌ను శాసించే స్థాయికి వెళ్ళాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది . మరి ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఈయన తర్వాత పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ వంటి ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమకు వచ్చినా కూడా చిరంజీవి వారికి పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు.

Chiranjeevi in Challenge: The Actor Before the Mega Star

ఇక చిరంజీవి గురించి ఎప్పుడు మాట్లాడకున్నా మెగాస్టార్ అని అంటూ ఉంటారు. ఇదే సమయంలో అసలు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది. ఈ బిరుదు ఎవరు ఇచ్చారు..? అన్న విషయం చాలామందికి తెలియదు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న కె.ఎస్ రామారావు చిరంజీవిని మెగాస్టార్ గా మార్చారు. కె.ఎస్ రామారావు బ్యానర్ లో చిరంజీవి ఐదు సినిమాల్లో నటించారు. ఇందులో మొదటి సినిమా అభిలాష. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.

Goonda Full Length Telugu Movie || Chiranjeevi, Radha || Ganesh Videos -  DVD Rip.. - YouTube

ఆ తర్వాత మళ్లీ కే ఎస్ రామారావు తో చిరంజీవి చాలెంజ్, రాక్షసుడు వంటి సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అదేవిధంగా రాక్షసుడు సినిమాతో చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్‌ నాగబాబు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా మరణ మృదంగం.. ఇక ఈ సినిమాతోనే తొలిసారిగా మెగాస్టార్ అనే బిరుదు చిరంజీవికి కేఎస్ రామారావు ఇచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన విజయం అందుకోలేకపోయింది.

Marana Mrudangam - Wikipedia

అయితే ఆ సినిమా హిట్ అవ్వకపోయినా చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు శాశ్వతం అయిపోయింది. అప్పటివరకు సుప్రీం హీరోగా పిలుచుకున్న చిరంజీవిని అందరు మెగాస్టార్ అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఇక చిరంజీవి కె.ఎస్ రామారావు కాంబోలో వ‌చ్చిన‌ చివరి సినిమా స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకి దర్శకుడుగా చేసిన యండమూరి వీరేంద్రనాథ్ కారణంగా ఈ సినిమా ప్లాఫ్ అయిందని ఆయనే ఒప్పుకున్నారు.. ఎందుకంటే తనకి డైరెక్షన్ చేయడం అంతక రాదని అందువల్ల ఈ సినిమా ప్లాఫ్ అయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విధంగా చిరంజీవికి కే.ఎస్ రామారావు కారణంగా మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. ఇంతటి గొప్ప బిరుదు ఇచ్చిన ఆయనకు మంచి విజయం ఇవ్వలేకపోయాడు చిరంజీవి.