టాలీవుడ్ స్టార్ బ్రదర్స్ లాంటి హీరోల అభిమానుల మధ్య వార్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్‌ వారి పాట సినిమా తరవాత స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న తన 29వ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. మార్చి 31న మహేష్ తండ్రి కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను అభిమానులకు అందించారు.. దానికి మహేష్ అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిన్న వీడియోకి ఏకంగా 17 మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి.

Guntur Karam: Mahesh Babu is highly inflammable | cinejosh.com

ఈ వీడియో మహేష్ బాబు అభిమానులను తెగ ఇంప్రెస్ చేసింది.. ఇప్పుడు వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన మహేష్ ఒక్కసారిగా సాల్ట్ అండ్‌ పెప్పర్ మాస్ లుక్ లో ఇరగదీసాడు.. నోట్లో బీడీ పెట్టుకుని మహేష్ చెప్పిన డైలాగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు అంటే టైటిల్స్ లో అ అక్షరంతో ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి.. అయితే ఈ సినిమా టైటిల్ మాత్రం ఆ సెంటిమెంట్‌కు భిన్నంగా రావటం గమనార్హం.

ఇదే సమయంలో ఈ గ్లింప్ల్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. అది కూడా మహేష్- ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఓ బీకరమైన యుద్ధమే జరుగుతుంది. ఈ ఇద్దరు హీరోల అభిమానులు తమ హీరో మాస్ అంటే తమ హీరో మాస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. మామూలుగా ఇతర హీరోలు సినిమాలు పరంగా కాకుండా ఎంతో స్నేహంగా ఉంటారు.

NTR 30 is officially titled Devara; NTR looks marvelous in the first look  poster | 123telugu.com

ఎన్టీఆర్ కూడా మహేష్‌ను అన్న అంటూ ఎంత గౌరవంగా పిలుస్తూ ఉంటాడు.. మహేష్ కూడా ఎన్టీఆర్ తో అంతే క్లోజ్ గా ఉంటాడు. ఇలాంటి మంచి స్నేహితుల లాంటి హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి దిగటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఫ్యాన్ వార్‌ గురించి ఈ హీరోలు ఇద్దరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.