Viswak Sen : విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మారిముత్తు డైరక్షన్ లో వస్తున్న సినిమా ఓరి దేవుడా. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. తమిళంలో సూపర్ హిట్టైన ఓ మై కడవులే సినిమాకి రీమేక్ గా ఈ మూవీ వస్తుంది. సినిమాలో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో స్పెషల్ రోల్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు.
సినిమా ఫస్ట్ గ్లింప్స్ గా విక్టరీ వెంకటేష్ టీజర్ రిలీజ్ చేశారు. లవ్ కోర్ట్ లో వెంకటేష్ ఉండగా డోర్ తీసుకుని ఎన్నో సమస్యలున్న వ్యక్తిగా విశ్వక్ సేన్ వస్తాడు. వెల్ కం వెల్కం అంటూ వెంకటేష్ లుక్ రివీల్ అవుతుంది. ఈ టీజర్ లో వెంకటేష్ లుక్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా విశ్వక్ సేన్ సినిమాలో కూడా నటించడానికి వెంకీ రెడీ అవడం ఆయన గొప్పతనాన్ని ప్రూవ్ చేస్తుంది.
పివిపి బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. అక్టోబర్ 21న ఓరి దేవుడా సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విశ్వక్ సేన్ (Viswak Sen ) ఈమధ్యనే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మెప్పించాడు. మరి ఈ ఓరి దేవుడా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.