Samantha : సమంత పెళ్లికి సద్గురుకి సంబంధం ఏంటి..?

Samantha : స్టార్ హీరోయిన్ సమంత మ్యారేజ్ న్యూస్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. సమంత సెకండ్ మ్యారేజ్ కి రెడీ అవుతుందని టాక్. సమంతని మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరో కాదు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు అని అంటున్నారు. సమంత్ రెగ్యులర్ గా ఆయన కార్యక్రమాలను ఫాలో అవుతుంది. డైవర్స్ తర్వాత సమంత డిప్రెషన్ టైం లో కూడా ఆయన బోధనలు విని దాని నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.

సమంతకి రెండో పెళ్లి చేసుకోమని సద్గురు సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. సమంతకి సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేకపోయినా సరే తాను ఎంతగానో ఆరాధించే వ్యక్తి సలహా ఇవ్వడంతో సమంత కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. అంతేకాదు సమంత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి క్రిస్టియన్ అయ్యి ఉండాలని ఆమె కుటుంబ సభ్యులు బలవంతం చేస్తున్నారట. అంతేకాదు ఈసారి సమంత పేరెంట్స్ చూప్సిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట.

Samantha పెళ్లి మ్యాటర్ లో సద్గురుని కూడా మెన్షన్ చేయడం హాట్ న్యూస్ గా మారింది. అయితే సమంత నుంచి దూరమయ్యాక నాగ చైతన్య మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడప్పుడే లేదని చెప్పేశాడు. ఈమధ్య ఓ హీరోయిన్ తో చైతు రిలేషన్ లో ఉన్నాడని వార్తలు రాగా అది కూడా నిజం కాదని తెలుస్తుంది.

Tags: Chaitu, Naga Chaitanya, Sadhguru, Sam, Samantha, Samantha Marriage