వరుణ్-లావణ్య పెళ్లి అక్కడే.. ఆ స్పెషల్ ప్లేస్ తో వీళ్ళకున్న సెంటిమెంట్‌ ఇదే..!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠిలు తాజాగా నిశ్చితార్థం చేసుకున్న విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండటమే కాకుండా, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపించాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ మెగా ఫ్యామిలీలో వరుణ్-లావణ్యల ఎంగేజ్‌మెంట్ ఘనంగా నిర్వహించారు.

అయితే, వీరి పెళ్లికి ముహూర్తం మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. కొన్ని నెలల తరువాత ఈ జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని చూస్తోందట. అంతేగాక, వీరు తమ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుపుకోవాలని చూస్తున్నారట. దీనికోసం వరుణ్-లావణ్యలు ఇప్పటికే కొన్ని ప్లేసెస్‌ను తమ లిస్ట్‌లో పెట్టుకున్నారట. అందులో ఫస్ట్ ఛాయిస్ మాత్రం ఇటలీ అని తెలుస్తోంది. ఇటలీతో వరుణ్-లావణ్యలకు ఓ మంచి సెంటిమెంట్ కూడా ఉందట.

గతంలో వరుణ్ తేజ్, లావణ్యలు ‘మిస్టర్’ సినిమా కోసం ఇటలీ వెళ్లగా, అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. వారి బంధానికి పునాది అక్కడే పడిందని తెలుస్తోంది. అందుకే ఇటలీ అంటే ఈ జంటకు చాలా ఇష్టమట. దీంతో, తమ పెళ్లిని కూడా ఇటలీలో చేసుకోవాలని వీరిద్దరు భావిస్తు్న్నారు. మరి నిజంగానే వరుణ్-లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో జరుగుతుందా.. అనేది చూడాల్సి ఉంది.

Tags: celebrities news, latest film news, latest filmy updates, latest news, Lavanya Tripathi, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, varuntej, viral news