రామ్ చరణ్ కంటే ఉపాసన ఆస్తి అంత ఎక్కువా..?.. ఎన్ని వేల కోట్లో తెలుసా..!

త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా మారి ప్రపంచవ్యాప్తంగా తన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇదే సమయంలో రామ్ చరణ్ కి ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి ముఖ్య కారణం తన భార్య‌ ఉపాసన కడుపులో పెరుగుతున్న బిడ్డ అని మురిసిపోయాడు. వారి ఆనందాన్ని నిజం చేస్తూ ఈనెల 20న తెల్లవారుజామున 1 :49 నిమిషాలకు ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయంతో మెగా కుటుంబమే కాకుండా మెగా అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు.

Ram Charan-Upasana Konidela Attend Baby Shower Hosted by Friends and Family  with Sania Mirza, Allu Arjun, Kanika Kapoor in Attendance (View Pics) |  LatestLY

గత పది సంవత్సరాలగా ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చిందంటూ అందరూ సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ ఎంతో సెంటిమెంట్ గా భావించే మంగళవారం రోజే రామ్ చరణ్ కు పాప జన్మించడంతో ఆ లక్ష్మీదేవి మా ఇంట్లోకి వచ్చిందంటూ కుటుంబమంతా సంబరాలు చేసుకుంది. ఇక ఇప్పుడు ఇదే సమయంలో రామ్ చరణ్ భార్య ఉపాసన ఏం చదువుకుంది.. తన ఆస్తి విలువ ఎంత అన్న వివరాలు మెగా అభిమానులు ఆరా తీస్తున్నారు.

Ram Charan's wife Upasana shares 1st post after pregnancy announcement,  says 'entering motherhood with blessings' - India Today

ఇప్పుడు ఉపాసన ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 100బిలియనీర్స్‌లో ఉపాసన తాతగారు కూడా ఒకరు.. రామ్ చరణ్- ఉపాసన ఆస్తి విలువ సుమారు రూ.2500 కోట్లు పైనే ఉంటుంది ఇక ఇందులో ఒక ఉపాసన ఆస్తి సగానికి పైగా ఉంటుంది. రూ.1130 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఉపాసన ఇండియాలోనే బడా వ్యాపారవేత్త కుటుంబం కి చెందిన మహిళ. ఉపాసన బిజినెస్‌ టైకూన్‌ శ్రీ ప్రతాపరెడ్డి మనవరాలు.. ఆయన అపోలో హాస్పిటల్స్ కు చైర్మన్ గా ఉన్నారు.

Ram Charan and wife Upasana Kamineni attend Anushpala Kamineni's wedding -  see INSIDE photos, Telugu Cinema News | Zoom TV

ఆయన ఆస్తుల విలువ సుమ‌రు రూ.21,000 కోట్లు. ఇండియాలోనే టాప్‌ 100 బిలియనీర్స్‌లో ఆయన కూడా ఒకరు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌ మార్కెట్‌ విలువ రూ.70,000 కోట్లుగా ఉంది. అపోలో హాస్పిటల్స్‌కు ఉపాసన వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇక ఉపాసన చదువు విషయానికి వస్తే.. ఈమె ఇంటర్నేషనల్‌ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఇక చ‌దువు పూర్తి అయ‌న‌వెంట‌నే వారీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది.

 

Upasana Kamineni Konidela celebrates baby shower ceremony with husband Ram  Charan, close friends and family in Dubai - FilmiFeverఅపోలో హాస్పిటల్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా మారింది. అంతేకాకుండా బీ పాజిటివ్ అనే ఒక మ్యాగజైన్ కు ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తుంది. వీటితోపాటుగా కుటుంబాల ఆరోగ్య భీమాకు సంబంధించి టీపీఏ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఉంది.. వ్యాపారా రంగంలోనే కాకుండా ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటుంది.