మెగా కుటుంబంలో అంతమంది మనవరాలు ఉన్నారా..? చిరంజీవి సో లక్కి తాతయ్య..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎంతోమంది హీరోలు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మెగా హీరోలే ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు. ఇప్పుడు ఆయన కెరీర్ ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది.

Chiranjeevi's daughter Sreeja drops husband Kalyaan's last name on  Instagram, sparks divorce speculations

ఇదే సమయంలో రామ్ చరణ్ కు పాప పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి తాతయ్య అయిపోయాడు. రామ్ చరణ్ ఉపాసనకు పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత మెగా కుటుంబంలో వారసురాలు వచ్చింది. రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులవ్వడంతో పెద్ద ఎత్తున వారికి శుభాకాంక్షలు వచ్చాయి. మెగా కుటుంబం ఎంతో సెంటిమెంట్ గా భావించే మంగళవారం నాడు ఈ మహాలక్ష్మి పుట్టడంతో సంతోషంగా ఉందని చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Sushmita Konidela (Chiranjeevi Daughter) Wiki, Biography, Age, Family,  Movies, Images - News Bugz

ఇదే సమయంలో మరొక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే చిరంజీవి ఫ్యామిలీలో ఇప్పటివరకు అందరికీ ఆడపిల్లలే పుట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా ఆ పాపే పుట్టింది. ఇక చిరంజీవికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కి సమర, సంహిత అని ఇద్దరు ఆడపిల్లలు. ఇక చిన్న కూతురు శ్రీజ కి నివృత్తి, నవిష్క ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు చరణ్ దంపతులకు కూడా పుట్టిన పాపతో కలిపి మొత్తం ఐదుగురు మనవరాళ్ళు మెగా ఇంటికి వచ్చారు.

Ram Charan's Wife Upasana On Raising Her Child: "Will Be Allowed The  Freedom To Be Themselves But..."