మెకానిక్ తో ఎఫైర్ నడుపుతున్న కీర్తి సురేష్.. బయటపడ్డ ఇంట్రెస్టింగ్ ఫోటోలు..!

ఇక గత కొద్దిరోజుల నుంచి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె సోషల్ మీడియాలో ఏ ఫోటో షేర్ చేసిన అందులో ఆమె కాబోయే భర్త అతనే అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఓ బడా వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ కనిపించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగ అందులో ఉన్న ఆ వ్యక్తి కీర్తి సురేష్ కాబోయే భర్త అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు రాసుకోచ్చారు.

ఆ ఫోటో పై కీర్తి సురేష్ స్పందించి తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో త్వరలోనే చెబుతానని చెప్పుకొచ్చింది. అలాగే కీర్తి సురేష్ తల్లి మేనక కూడా గతంలోనే తన కూతురు పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అయినప్పటికీ ఆమె పెళ్లి వార్తలు ఆగకపోవడంతో కీర్తి సురేష్ తండ్రి కూడా రంగంలోకి దిగి తన కూతురికి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేయను ఒకవేళ చేసుకుంటే గనక మేమే స్వయంగా ప్రకటిస్తాం ప్రకటించాడు.

Keerthi Suresh (Keerthy Suresh) Photos | Keerthi Suresh Images | Keerthi  Suresh Pictures - FilmiBeat

ఇక ఇలా కుటుంబం మొత్తం ఆమె పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వటంతో సోషల్ మీడియాలో కీర్తి పై వచ్చే పెళ్లి వార్తలు ఆగిపోయాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి కీర్తి సురేష్ ఓ వ్యక్తితో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో కీర్తి సురేష్ రెడ్ డ్రెస్ వేసుకుని తన పక్కన ఉన్న వ్యక్తితో నవ్వుతూ అలాగే చాలా క్లోజ్ గా అతని భుజాలపై చేయి వేసి వేలాడుతూ ఉంది. అలాగే మరో ఫోటోల కీర్తి సురేష్ ఆ వ్యక్తితో చనువుగా ఉంటూ మాటలాడుతుంది.

ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఫోటోలు చూసిన కొందరు ఈ విధంగా క్యాప్షన్ పెట్టారు.. ఇక అది ఏమిటంటే ఓ సినిమా షూటింగ్ సెట్ లో కీర్తి సురేష్ మెకానిక్ తో ప్రేమాయణం నడిపిస్తుంది అంటూ ఆ ఫోటోలుకు క్యాప్షన్ ఇచ్చారు. అలా క్యాప్షన్ ఇచ్చినా ఫోటోలు కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దీంతో ఆ క్యాప్షన్ చూసిన‌ కీర్తి సురేష్ అభిమానులు కూడా కోపంతో మండిపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలియకుండానే అలా లేనిపోని వార్త‌లు, ఎఫైర్లు అంటగట్టడం న్యాయమేనా అంటూ ఆ క్యాప్షన్ పెట్టిన నెటిజెన్లపై తీర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.