శ్రీలీలే నాకు హీరోయిన్‌గా కావాలి… పెద్ద ప్లాన్ వేసి మెలిక పెట్టిన స్టార్ హీరో…!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం అన్నది కామన్ అయిపోయింది. ఒక హీరో లేదా ద‌ర్శ‌కుడు ఓ హీరోయిన్ త‌మ సినిమాలో కావాల‌ని ప‌ట్టుబ‌డితే ఏదోలా ఆమెను తీసుకునే వ‌ర‌కు సినిమా ఒప్పుకోరు. హీరోలు అయితే ఏదైనా హీరోయిన్ మీద మోజుప‌డితే ఆమె డేట్లు దొరికే వ‌ర‌కు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కాల్షీట్లు ఇవ్వ‌రు. ఇలాంటి ప‌రిస్థితులు ఇండ‌స్ట్రీలో ఉన్నాయి.

Dhamaka' Day 6 Box office collections: Ravi Teja, Sreeleela and Trinadha  Rao Nakkina's film hits half a century at the Tollywood box-office | Telugu  Movie News - Times of India

ఇక ద‌ర్శ‌కులు, హీరోలు త‌మ‌కు క‌లిసి వ‌చ్చిన హీరోయిన్ల సెంటిమెంట్ల‌ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా ఇప్పుడు శ్రీలీల కోసం పెద్ద స్కెచ్ వేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క్రాక్ జోడీ రవితేజ – ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ ఇప్పుడు క‌లిసి కొత్త సినిమా చేస్తున్నారు. ధమాకా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల‌ను తీసుకోవాల‌ని ర‌వితేజ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌న మాటే నెగ్గించుకున్నాడ‌ట‌. త‌న‌కు క్రాక్ లాంటి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్‌తో సినిమా చేయ‌డం ర‌వితేజ‌కు ఇష్ట‌మే అయినా.. శ్రీల‌ల త‌ప్ప‌న‌సరిగా త‌న ప‌క్క‌న ఉండాల్సిందే అని చెప్పాడ‌ట‌. చివ‌ర‌కు నిర్మాత‌లు కూడా శ్రీలీల కాల్షీట్ల‌ను అతి క‌ష్టం మీద సంపాదించార‌ట‌.

10 Ravishing pictures of 'Pellisanda-D' actress Sree Leela | Times of India

ఇక ఇప్పుడు మ‌రో ట్విస్ట్ ర‌వితేజ – ధ‌మాకా ద‌ర్శ‌కుడు న‌క్కిన త్రినాథ‌రావు క‌లిసి మ‌రో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌. న‌క్కిన చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ర‌వితేజ ఓకే చెప్పేశాడ‌ట‌. ఇది మ‌లినేని గోపీ సినిమాకు స‌మాంత‌రంగా షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది.