‘ టిల్లూ స్క్వేర్ ‘ … సిద్ధు అనుప‌మ‌ను బాగా అంటే బాగా వాడేశాడు.. ( వీడియో )

సూపర్ హిట్ అయిన డిజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది టిల్లు స్క్వేర్. కథలో ఎన్ని మార్కులు చేర్పులు జరిగాయి అన్నది అప్పుడే తెలియదు.. అయితే టిల్లు క్యారెక్టర్ మాత్రం సేమ్ టు సేమ్ అనేలా ఉంది. ఈరోజు నుంచి పాటల‌ హంగామా అయితే మొదలైపోయింది. ఫస్ట్ లిరికల్ వీడియోగా టిక్కెట్ కొనకుండా అనే సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ పాట కోసం డీజే టిల్లు సెంటిమెంట్ ఫాలో అయినట్టు తెలుస్తోంది. డీజే టిల్లు సినిమాకు ఓ హైప్‌ తీసుకొచ్చిన టైటిల్ సాంగ్ ను రాము మిరియాల పాడారు. కాసర్ల శ్యామ్ ఈ పాట రాశారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కోసం కూడా సేమ్ సెంటిమెంట్ ఫాలో అయ్యారు. టిక్కెట్ కొనకుండా పాటను శ్యామ్ రాయగా రామ మిరియాల ఆలపించారు. ఇక ఈ పాటకు మ్యూజిక్ కూడా రామ్ ఇవ్వటం విశేషం.

ఈ ఫస్ట్ సాంగ్ లో ఫస్ట్ లో అనుపమ పరమేశ్వర‌న్‌ను ఎలా టీజ్‌ చేస్తాడో చక్కగా చూపించారు. పాట ప్రారంభానికి ముందు సిద్దు – అనుపమ మధ్య వచ్చిన డైలాగులు థియేటర్లలో కేక పెట్టించేలా ఉన్నాయి
ఉన్నాడా భాయ్‌ఫ్రెండ్ ఎందుకు.. ఉంటే నా షూ నేను వేసుకుని పోతాను.. లేక‌పోతే నిన్నేసుకుని పోతాను.. ఏడికి అంటే నువ్వేడ‌కంటే ఆడ‌కు అంటాడు. ఇప్పుడే క‌ద‌రా క‌లిశావ్‌.. అప్పుడే ఫ్ల‌ర్ట్ చేస్తావా ? అని అడుగుతుంది.. ఏదేమైనా ఈ డైలాగులు చూస్తుంటే అనుప‌మ‌ను సినిమాలో ఓ రేంజ్‌లో వాడ‌డంతో పాటు పిచ్చ న‌లుపుడు ( క్యారెక్ట‌ర్ ప‌రంగా బాగా వాడుకోవ‌డం) న‌లిపిన‌ట్టుగానే ఉంది.