‘ బ్రో ‘ బుకింగ్స్ ఇంత స్లోగానా… టాక్ బాగుంటేనే లేక‌పోతే ప్చ్‌…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే రెండు తెలుగు స్టేట్స్ ఊగిపోవాలి. అసలు బుకింగ్స్ స్టార్ట్ అయితే టికెట్లు సింపుల్గా అయిపోవాలి. కానీ పవన్ తన మేనల్లుడు సాయి ధరంతేజ్ తో కలిసి నటిస్తున్న బ్రో సినిమా బుకింగ్స్ చాలా అంటే చాలా స్లోగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. పవన్ సినిమా వస్తుంది అంటే చాలు నైజంలో హాట్‌ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడ‌వ్వాలి.. అయితే బ్రో సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన చాలా థియేటర్లలో టికెట్లు అందుబాటులోనే ఉంటున్నాయి.

హైదరాబాదులో ప్రధాన థియేటర్లో అయిన‌ ప్రసాద్ ఐమాక్స్ – ఏ ఏ ఏ మాల్ – ఏ ఎం బి లాంటి చోట్ల తప్ప మిగిలిన థియేటర్లలో, మాల్స్ సింగిల్ స్క్రీన్ లలో టిక్కెట్లు చాలా స్లోగా తెగుతున్నాయి. గురువారం ఉదయానికి కానీ ఫుల్స్‌ పడలేదు. మామూలుగా పవన్ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ అయితే చాలు రెండో రోజు, మూడో రోజు అయిన శని, ఆదివారాలు కూడా గంటా రెండు గంటల్లోనే ఫుల్ అవుతాయి. అయితే ఇప్పటికీ శని, ఆదివారాలు చాలా థియేటర్లలో టిక్కెట్లు అలాగే ఉన్నాయి.

చిన్న సినిమాలకు అయితే ఇది కామన్. పవర్ స్టార్ లేదా ఆ రేంజ్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ముందే మూడు రోజుల టికెట్లు అన్నీ అయిపోతాయి. మీడియం రేంజ్ సినిమాలకు మొదటి రోజు టాక్ చూసి మిగిలిన రెండు రోజుల రన్ ఉంటుంది. అయితే బ్రో సినిమా విషయంలో రెండు, మూడు రోజుల టికెట్లు అన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. పైగా ఇందులో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు.. పవన్ హీరో అంటే ఆ సినిమా రేంజ్ వేరేగా ఉండాలి.

భీమ్లా నాయక్ తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకుని పవన్ నటిస్తున్న సినిమా ఇది. ఎందుకో కానీ ఆ రేంజ్ ఊపు ఇంకా కనపడటం లేదు. పవన్ ఫ్యాన్స్ దృష్టి అంతా ఉస్తాద్‌, ఓజి సినిమాల మీదే ఉన్నట్టు కనిపిస్తోంది. పైగా బ్రో రీమేక్‌ సినిమా ఎందుకో ? వారికి అంతగా ఆసక్తి లేదని టికెట్ బుకింగ్ చెబుతున్నాయి. అదే సినిమాకు బాగుందన్న టాక్ వస్తే అప్పుడు చూద్దాంలే అన్న ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. భీమ్లానాయ‌క్‌ నైజంలో రు. 27 కోట్ల షేర్ రాబట్టింది. బ్రో సినిమా రు. 33 కోట్ల మేర వసూళ్లు చేస్తేనే బయ్యర్ సేఫ్ అవుతాడు. ఇదంతా సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి ఉంటుంది.