‘ బ్రో ‘ లో త‌న క్యారెక్ట‌ర్ గుట్టు మొత్తం విప్పేసిన ప‌వ‌న్‌… ఆ టాప్ సీక్రెట్ చెప్పేశాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వరుసగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొద్ది గంటల్లో తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసిన నటించిన బ్రో సినిమాతో పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మెయిన్ రోల్ చేస్తున్నా… పవన్ సినిమాను మ‌లుపు తిప్పే కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కేతిక శర్మ – ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సముద్రఖ‌ని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు పవన్ ఎంతసేపు ? కనిపిస్తారు అన్న ఆసక్తి పవన్ అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో ఉంది.

ఇటీవల హీరో సాయిధర‌మ్ తేజ్‌ ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే పవన్ పాత్ర ఎంట్రీ ఉంటుందని.. అక్కడ నుంచి చివరి వరకు ఉంటారని క్లారిటీ ఇచ్చాడు. అయితే లేటెస్ట్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కూడా తన పాత్ర పై క్లారిటీ ఇవ్వటం వైరల్ గా మారింది.

తాను ఈ సినిమాకి కేవలం 20 రోజులు మాత్రమే వర్క్ చేశానని.. అయినా కూడా సినిమా అంతా తాను 80% కనిపిస్తానని పవన్ చెప్పేశాడు. దీనినిబట్టి పవన్ పాత్ర సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల నుంచి ఎండింగ్ వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం రన్ టైం 134 నిమిషాల పాటు ఉండనుంది.