‘ రాజ‌కుమారుడు ‘ కంటే ముందే మ‌హేష్ మిస్ అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే..!

హాస్య న‌టుడు అలీని హీరోను చేసిన సినిమా `య‌మ‌లీల‌`. ఈ సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు చిన్న చిన్న వేషాలు వేస్తున్న అలీ.. ఒక్క‌సారిగా స్టార్ అయ్యారు. ముఖ్యంగా త‌ల్లి పాత్ర‌లో ఒదిగిపోయిన మంజులతో అలీ న‌ట‌న అద్భుతం అనే పేరు తెచ్చుకుంది. వ‌ర్ధ‌మాన ద‌ర్శ‌కుడిగా పేరున్న అప్ప‌టి ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన స‌రికొత్త ప్ర‌యోగం ఇది. అయితే.. ఇంత చ‌క్క‌టిక‌థ‌కు.. అలీని ఎంచుకోవ‌డం వెనుక రీజ‌నేంట‌నేది.. టాలీవుడ్‌ను కొన్నాళ్ల‌పాటు కుదిపేసింది.

ఎందుకంటే.. సాధార‌ణంగా క‌థ బ‌లంగా ఉన్న‌ప్పుడు.. బ‌ల‌మైన హీరోను పెట్టుకుంటారు. కానీ, ఇక్క‌డ క‌థ పూర్తిస్తాయిలో బ‌లంగా ఉంది. పైగా.. సెంటిమెంటుతోనూ కూడుకున్న‌ది. అయితే.. అలీ వంటి ఒక క‌మెడియ‌న్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి ఎందుకు ఎంచుకున్నార‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీనికి ముందు ఏం జ‌రిగిందంటే.. వాస్త‌వానికి ఈ సినిమాకు హీరోగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబును తీసుకోవాల‌ని అనుకున్నారు.

అప్ప‌టికి మ‌హేష్‌బాబు ఇంకా పూర్తిస్థాయిలో హీరోగా అరంగేట్రం చేయ‌లేదు. దీంతో ఆ ఛాన్స్ తీసుకుని మ‌హేష్‌బాబుతోనే న‌టింప‌జేయాల‌ని ఎస్వీ కృష్ణారెడ్డి ప్లాన్‌. అందుకే.. అదే రేంజ్‌లో ఉండే హీరోయిన్‌ను దృష్టిలో పెట్టుకుని.. క‌థ రెడీ చేసుకున్నారు. దీనిపై మ‌హిష్‌బాబుకూడా ఓకే అన్నారు. క‌థ ఫైన‌ల్ అయినా.. కూడా.. చివ‌రి నిముషంలో త‌న తండ్రి కృష్ణ‌ను సంప్ర‌దించాల‌ని సూచించార‌ట మ‌హేష్‌బాబు.

Mahesh Babu's Super Hit Rajakumarudu completes 21 years

దీంతో కృష్ణారెడ్డి.. నేరుగా కృష్ణ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌థ వినిపించార‌ట‌. అయితే.. కృష్ణ‌కు క‌థ న‌చ్చినా.. మ‌హేష్‌బాబు ఫ‌స్ట్ పిక్చ‌ర్ ఇలా కాదు… నాకు కొన్ని అంచ‌నాలు న్నాయి. క‌థ‌లో మార్పు చేస్తే.. ఓకేచేద్దాం అని సూచించారు. కానీ, కృష్ణారెడ్డి అందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో మ‌రొక‌రిని ట‌చ్ చేయ‌డం ఇష్టం లేక‌.. అలీని అడిగి.. ఒప్పించి.. ఓకే చేయించార‌ట‌.

From Raja Kumarudu to Maharshi; take a look at Mahesh Babu's Tollywood  journey | Telugu Movie News - Times of India

 

అలీని హీరో అనుకున్న తర్వాత కథలో మార్పులు, డైలాగుల్లో మార్పులు.. అక్కుంబ‌క్కుం అనే ప్రాస‌లు.. వ‌చ్చి చేరాయి. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ‘యమలీల’ ఎవరూ ఊహించని విజయం సాధించింది. మొత్తానికి సూప‌ర్ హిట్ కొట్టిన య‌మ‌లీల సినిమాకు ముందు జ‌రిగింది కూడా పెద్ద స్టోరీయేన‌ని ఎస్వీ కృష్ణారెడ్డి త‌ర‌చుగా చెప్పేవారు. అలా రాజ‌కుమారుడు కంటే ముందే మ‌హేష్ ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిపోయాడు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, mahesh babu, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news