చంద్ర‌బాబు ఎన్నిసార్లు సీఎం అయినా ఇదో బ్యాడ్‌ల‌క్.. ఈ సారి రీ సౌండ్ వ‌చ్చేలా చేస్తాడా..!

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు టి‌డి‌పి పరిస్తితి చాలా మెరుగైంది..అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా టి‌డి‌పి ముందుకెళుతుంది. అయితే ఇంకొద్దిగా కష్టపడితే టి‌డి‌పి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడం సులువు అని చెప్పవచ్చు. అయితే అంతా బాగానే ఉంది..టి‌డి‌పి పుంజుకుంటుంది. అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే..అసలైన స్థానాల్లో టి‌డి‌పి వెనుకబడటం కాస్త ఇబ్బందిగా మారింది.

 

అది కూడా పార్టీ అధినేత చంద్రబాబు సొంత గడ్డ, అటు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత గడ్డ..ఈ రెండు స్థానాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. ఇప్పటికీ అక్కడ గెలుపు దక్కే పరిస్తితి లేదు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే. 1978లో చంద్రబాబు ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు. 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టి‌డి‌పిలోకి రావడం, కుప్పం నుంచి పోటీ చేయడం జరుగుతుంది.

అయితే చంద్రగిరిలో టి‌డి‌పి వరుసగా ఓటములు పాలవుతుంది. ఎప్పుడో 1994లో చివరిగా అక్కడ గెలిచింది. అది కూడా చంద్ర‌బాబు సోద‌రుడు నారా రామ్మూర్తినాయుడు మాత్రమే అప్పుడు అక్క‌డ గెలిచారు. మళ్ళీ ఇంతవరకు అక్కడ టీడీపీ గెలవలేదు. పైగా ఇప్పటికీ అక్కడ వైసీపీ బలం ఉండటం విశేషం. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నారు.

నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన తన్యుడు మోహిత్ రెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయనకు టి‌డి‌పి చెక్ పెట్టలేని పరిస్తితి. ఇటు ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ అసలు టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు. ఇప్పటికీ అక్కడ టి‌డి‌పికి ఆధిక్యం లేదు. వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని యూజ్ చేసుకోలేని స్థితిలో టి‌డి‌పి ఉంది. ఇలా ఎన్టీఆర్, బాబు సొంత గడ్డలపై టి‌డి‌పి ఓడిపోతూ వస్తుంది. మరి ఈ సారైనా ఆ బ్యాడ్ లక్ దాటుకుని గెలుస్తుందేమో చూడాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp