విడాకుల ఇష్యూలో త‌ప్పంతా చైతూతే… ప‌క్కా ఆధారాల‌ను బ‌య‌ట పెట్టిన స‌మంత‌..?

నాగచైతన్యతో సమంత విడిపోయి ఏడాదిన్నర దాటుతోంది. ఈ విడాకులు తర్వాత సమంత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే తెలుగు సినిమా అభిమానులతో.. పాటు అక్కినేని అభిమానుల నుంచి భారీ ట్రోలింగ్‌కు కూడా సమంత గురైంది. అసలు విడాకుల తర్వాత ఓ మహిళకు ఎన్ని అవమానాలు ?ఎదురవుతాయో ఓ సెలబ్రిటీగా ఉన్న సమంతకు అంతకంటే ఎక్కువ అవమానాలు ఎదురయ్యాయి. విడాకులు తీసుకున్న రెండు నెలలకే సమంత బన్నీ పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ లో నటించింది.

Chef Surender Mohan deletes the Instagram picture that spotted Naga  Chaitanya and Sobhita Dhulipala together in London! | Telugu Movie News -  Times of India

ఈ సాంగ్‌లో విచ్చలవిడిగా అందాలు కూడా ఆరబోసేసింది. దీంతో సమంతకు సిగ్గు లేదని.. ఆమె విచ్చలవిడిగా బరితెగించేసింది అంటూ రకరకాలుగా విమర్శలు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ?సమంత తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది. ఇక నాగచైతన్య ముందు నుంచి సైలెంట్ గా ఉండేవాడు. ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడలేదు. అయితే శాకుంతలం సినిమా ప్రమోషన్లలో సమంత తన స్టైల్ కు భిన్నంగా మాట్లాడింది.

Samantha Ruth Prabhu, Naga Chaitanya to Get Back Together After Divorce?  Here's What We Know

విడాకుల గురించి ఆమె పరోక్షంగా చైతుదే తప్పు అన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది. అయితే ఓవైపు నాగచైతన్య శోభిత – దూళిపాళ్ల మధ్య ఎఫైర్ నడుస్తుందని.. వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నార‌న్న పుకార్లు కూడా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంత విడాకుల గురించి మాట్లాడటం సంచలనంగా మారింది. ప్రస్తుతం చైతు – శోభిత లండన్లో సీక్రెట్ గా చెక్కర్లు కొడుతున్నారు. ఈ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

How Naga Chaitanya fell into Samantha trap | cinejosh.com

ఇక స‌మంత విడాకుల గురించి మాట్లాడుతూ వైవాహిక జీవితానికి సంబంధిం తాను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నాను.. అంతే నిజాయితీతో రిలేష‌న్‌షిఫ్‌కు అంకిత‌మయ్యాన‌ని కాన్ఫిడెంట్‌గా చెప్పింది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు మాట్లాడ‌ని స‌మంత చైతు – శోభిత డేటింగ్‌లో ఉన్నార‌న్న టైంలో మాట్లాడ‌డాన్ని బ‌ట్టి చూస్తే త‌ప్పు చైతు వైపు కూడా ఉందా ? చైతుయే స‌మంత‌ను పెళ్లి చేసుకుని.. శోభిత‌తో ముందు నుంచే లింకులు పెట్టుకున్నాడా ? అదే స‌మంత మ‌న‌సు విరిగిపోవ‌డానికి కార‌ణ‌మైందా ? ఇలా ర‌క‌ర‌కాల సందేహాలు ఇప్పుడు చైతుపై వ‌స్తున్నాయి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Naga Chaitanya, Samantha, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news