చిరంజీవి కెరీర్‌లో మ‌ధ్య‌లోనే ఆగిపోయిన సినిమాల లిస్ట్ ఇదే… లిస్ట్ పెద్ద‌దే…!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు చిరంజీవి. ఆయన తర్వాత ఈ మెగా కుటుంబం నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి వరుణ్ తేజ్ వరకు చిత్ర పరిశ్రమలలో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి సినీ కెరీర్ లో కూడా చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.. చిరంజీవి తన నట జీవితంలో ఇప్పటివరకు 150 పైగా సినిమాల్లో నటించారు.

Abu - Baghdad Gajadonga and Vikrama Simha Boopathi - Forum

అందులో చాలా సినిమాలు ఎన్నో ఇబ్బందులు దాటుకుని రిలీజ్ అయ్యాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం అడ్డంకులు దాటలేక, మరికొన్ని సినిమాలు అసలు ప్రారంభం కాక, షూటింగ్ మొదలైన అవి అక్కడే ఆగిపోయాయి. ఇలా చిరంజీవి కెరీర్ లో మధ్యలో ఆగిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

భూలోక వీరుడు: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ భారీ జానపద సినిమాగా చిరంజీవిని హీరోగా పెట్టి తీయాలనుకున్నారు. కానీ ఈ సినిమా కథ‌ అనుకున్నంత చాలా పర్ఫెక్ట్ గా రాకపోవడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు.

వినాలని ఉంది: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు.. ఈ సినిమాలో చిరుకు జంటగా ఊర్మిళా, టబులను హీరోయిన్లుగా ఎంచుకున్నారు. ఈ ఇద్దరితో రెండు పాటలు షూటింగ్ కూడా పూర్తి చేశారు.. అలానే కొంత భాగం సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు.. కానీ ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది.

 

అబు బాగ్దాద్ గజదొంగ: ప్రస్తుతం పాన్ ఇండియా పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమా అంటున్నారు కానీ.. చిరంజీవి ఎప్పుడో ఇలాంటి సినిమాలను మొదలుపెట్టాడు.. ఆ తరహా సినిమానే అబు బాగ్దాద్ గజదొంగ.. సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా సౌత్ భాషలతో పాటు, హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని తెరకెక్కించాలని భావించారు.. కాని ఈ సినిమా కూడా కొన్ని రోజులకు మధ్యలోనే ఆగిపోయింది.

Sridevi: Sridevi's shelved Telugu home production: Vajrala Donga:  Chiranjeevi, MGR, Kamal Haasan at the launch

వజ్రాల దొంగ: చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్లో వజ్రాల దొంగ అనే సినిమా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చేయాలని భావించారు.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలవగా మధ్యలోనే ఈ సినిమా ఆగిపోయింది.

కామెడీ సినిమాల దర్శకుడు ఎస్ వి. కృష్ణారెడ్డి కూడా చిరంజీవితో ఓ సినిమా చేయాలని భావించారు.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

వీఎన్‌. ఆదిత్య సినిమా: ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ సినిమాలతో మంచి విజయాలనుకున్న దర్శకుడు ఆదిత్య.. ఈయన కూడా చిరంజీవితో ఓ సినిమా చేయాలని భావించారు. చిరు కోసం ఓ కథను కూడా సిద్ధం చేశారు.. కానీ ఆ సినిమా ముందుకు వెళ్లలేదు.

ఆటో జానీ: చిరంజీవి రాజకీయాలనుంచి సినిమాల్లోకి రియంట్రీ ఇచ్చే సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేయబోతున్నాడు అంటూ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.. ఈ సినిమాపై చాలా రోజులు చర్చలు కూడా జరిగాయి.. ఆ సినిమా వర్కౌట్ అవలేదు.. ఈ విధంగా చిరంజీవి తన కెరియర్ లో చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.