ఆ స్టార్ హీరో అంటే రాఘవేంద్రరావు కు అంత ఇష్టమా..? ఆయన కోసం అలాంటి పనులు కూడా చేశాడా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాల‌కు కొత్త పంతుల తొక్కించిన దర్శకులలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముందు వరుస‌లో ఉంటారు.. ఒక సినిమాను ఎంతో అద్భుతమైన దృశ్య కావ్యంలా తెరకెక్కించడంలో రాఘవేంద్రరావు ది సపరేట్ శైలి అనే చెప్పాలి.. ఎందరో స్టార్ హీరోలకు వారి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ లు ఇచ్చారు.. కానీ ఇదే సమయంలో ఒక హీరోతో మాత్రం ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వలేదు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రు కే రాఘవేంద్రరావు సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.. మొత్తంగా వీరి కాంబినేషన్లో 9 సినిమాలు వచ్చాయి.. దాదాపు అన్ని సినిమాలు హిట్ సినిమాలుగా నిలిచాయి. వాటిలో ఎనిమిది సినిమాల్లో కృష్ణ హీరోగా నటించారు. ఒక సినిమాలో మాత్రం గెస్ట్ రోల్ పోషించారు.

Iddaru Dongalu - 7 Inch EP – vintagestore.in

 

కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన సినిమాలు విషయానికి వస్తే.. ముందుగా వీరి కాంబినేషన్లో భ‌లే కృష్ణుడు సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రెండో సినిమాగా ఘరానా దొంగ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కృష్ణకి జంటగా శ్రీదేవి నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

అడవి సింహాలు ఫోటోలు | Adavi Simhalu Tollywood Movie Photos, Pictures,  Wallpapers - Filmibeat Telugu

ఇక కృష్ణ రాఘవేంద్ర కాంబోల్ వచ్చిన మూడో సినిమా ఊరుకు మొనగాడు.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. కృష్ణ రాఘవేంద్రరావు కాంబోల్ వచ్చిన నాలుగో సినిమా అడవి సింహాలు.. ఈ సినిమాలో కృష్ణతో పాటు కృష్ణంరాజు కూడా హీరోగా నటించారు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరీ కాంబోలో వచ్చిన ఐదో సినిమా శక్తి ఈ సినిమాలో కృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాకూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది.

Gharana Donga Telugu Full Length Movie | Krishna Ghattamaneni, Sridevi,  Mohan Babu | MTV - YouTube

ఇక కృష్ణ రాఘవేంద్ర కాంబోలో వచ్చిన ఆరో సినిమా ఇద్దరు దొంగలు. ఈ సినిమాలో కృష్ణతోపాటు అందాల నటుడు శోభన్ బాబు కూడా మరో హీరోగా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఏడో సినిమా.. అగ్నిపర్వతం.. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన అన్ని సినిమాలు కన్నా మేమ‌రిబుల్‌ సినిమాగానిలిచింది. కృష్ణ రాఘవేందర్రావు కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదో సినిమా వజ్రాయుధం. ఈ సినిమా కూడా హిట్ సినిమాగా నిలిచింది.

Ooriki Monagadu Movie Completes 40 years In Telugu Industry - Sakshi

కృష్ణా రాఘవేంద్ర కాంబినేషన్లు వచ్చిన తొమ్మిదోవ‌ సినిమా రాజకుమారుడు. ఈ సినిమాలో కృష్ణ గెస్ట్ రోల్ లో కాసేపు కనిపించాడు. సినిమాతో మహేష్ ను హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా. మహేష్- కృష్ణ వారసుడుగా తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ విధంగా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొమ్మిది సినిమాలలో 8 సినిమాల్లో కృష్ణ హీరోగా నటించారు. అతిథి పాత్రలో రాజకుమారుడు సినిమాలో మెరిసేరు మొత్తంగా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం విశేషం.