జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసిన చిరంజీవి సినిమా ఇదే…!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం సహజమే. అయితే స్టార్ హీరోల అభిమానులు మాత్రం దీనిని ఒక్కసారి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మా హీరోనే చాలా గ్రేట్.. మా హీరో సినిమా గ్రేట్.. రికార్డులు అన్ని మా హీరోయే బద్దలు కొట్టాలని అనుకుంటూ ఉంటారు. హీరోలు ఎంత సఖ్యతతో ఉన్నా ? అభిమానులే గొడవలు కి దిగి ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటూ ఉంటారు.

Rudra Veena - Ilaiyaraaja - 8000 672 - (Condition 90-95%) - LP Record

ఇక హీరోలు మాత్రం ఎప్పటికప్పుడు మా కోసం మీరు అనవసరంగా గొడవ పడవద్దు.. మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల‌ని హీరోలు ఎన్నో సందర్భాలలో చెబుతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నోసార్లు అభిమానులకు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. కుటుంబాలను బాధ పెట్టవద్దని సలహాలు ఇస్తూ ఉంటారు. గతంలో ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తారు.

చిరంజీవి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పారు. అలా జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన సినిమాలలో రుద్రవీణ సినిమా పేరు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో నాకు దానవీరశూరకర్ణ సినిమా అంటే చాలా ఇష్టం.. అది మహాభారతం నుంచి వచ్చింది.. కర్ణుడు, దుర్యోధనుడు మధ్య స్నేహం చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ తెలిపారు.

Daana Veera Soora Karna (1977) - IMDb

దీనికి తోడు ఈ సినిమాలో తాతగారు మూడు క్యారెక్టర్లలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు.. కర్ణుడు – దుర్యోధనుడు మధ్య ఫిక్షనల్ స్నేహాన్ని సృష్టించారు.. అందుకే ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. అలాగే చిరంజీవి సినిమాలలో రుద్రవీణ అంటే చాలా ఇష్టం అని.. ఆయన ఓ స్టార్ హీరో అయి కూడా.. అలాంటి సినిమా చేయటానికి ఒప్పుకోవటం గ్రేట్ అని ఎన్టీఆర్ మెచ్చుకున్నాడు.

ఓ నటుడికి ఉండాల్సిన తృష్ణ అది.. మనలోని నటుడిని సంతృప్తి పరచడం చాలా కష్టమైన పని అని ఎన్టీఆర్ తెలిపాడు. ఇక రుద్రవీణ సినిమాని చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే.