ఇండ‌స్ట్రీ టాక్‌: లావ‌ణ్య ఈ బిహేవియ‌ర్ మార్చుకోక‌పోతే ఖ‌చ్చితంగా మెగా ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోదు…!

టాలీవుడ్ చిన్నది లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాబోతున్న వార్తలు ఇప్పుడు తెలుగు మీడియాను, తెలుగు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ తో లావణ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉందన్న వార్తలు తెలిసిందే. ఈ నెలలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఉంటుందని.. కొద్ది నెలల్లోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Varun Tej and Lavanya Tripathi to tie the knot? Actress has THIS to say |  Masala News – India TV

అయితే మెగా ఫ్యామిలీలో ఎందుకో పెళ్లి బంధాలు నిలబడటం లేదు. ఒక్కొక్కరు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అవి ఫెయిల్ అవుతున్నాయి. వీరందరూ గ్లామర్ ప్రపంచంతో అనుబంధంతో ఉంటున్నారు. పెళ్లయ్యాక కూడా ఆ బంధాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. అందుకే వీరి వైవాహిక జీవితాలు సజావుగా సాగటం లేదన్న గుసగుసలు ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి విషయంలోనూ అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

మెగా ఫ్యామిలీ కోడలిగా అడుగుపెట్టాలి అంటే కాస్త సంప్రదాయాలు పాటించాలి.. అయితే లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది. ఎద‌ అందాలు కనిపించేలా.. కుర్రకారును కవ్వించేలా రెచ్చగొట్టే డ్రస్సులు వేసుకుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే లావణ్య అదిరిపోయే అవుట్ ఫిట్ లలో గ్లామర్ మెరుపులు కూడా మెరూపిస్తోంది.

Lavanya Tripathi rubbishes rumours of marriage with Varun Tej Konidela |  Telugu Movie News - Times of India

తాజాగా క్యూట్ సెల్ఫీలతో.. కుర్ర కారు హృదయాన్నే గిలిగింతలు పెడుతోంది. మెగా ఫ్యామిలీ కోడలిగా అడుగుపెట్టే అమ్మాయి ఇలాంటి బిహేవియర్ తో ఉండటం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చటం లేదు. అందుకే లావణ్య ఇంత హాట్ హాట్ ఫోటోలతో రెచ్చగొడుతుండ‌డం మెగా అభిమానులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందం విషయంలో ఫిట్నెస్ విషయంలో లావణ్య ఎప్పుడూ శ్రద్ధతోనే ఉంటోంది.

అయితే దానిని సాకుగా చూపించి హాట్ హాట్ గా అందాలు ఆరబోయటం సరికాదని ఇండస్ట్రీ జనాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. మెగా కోడలిగా అడుగుపెట్టే అమ్మాయి గ్లామర్ ప్రపంచానికి దూరంగా… సాంప్రదాయానికి దగ్గరగా ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. మరి లావణ్య ఇకపై అయినా అందాలడోస్ తగ్గిస్తుందేమో చూడాలి.