పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న టాప్ 5 బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా బ్యాగ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ లో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప‌వ‌న్ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందంటే మొదటి రోజు థియేటర్ల వ‌ద్ద ఆ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. పవన్ తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసి ఉంటాడు. అందులో హిట్ ఆయిన సినిమాలు కూడా ఉన్నాయి. పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో టాప్ 5 సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Amma Nanna O Tamila Ammayi - Wikipedia

పోకిరి సినిమా మహేష్ బాబుకు ఎంత క్రేజ్ తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. పూరి జగన్నాథ్‌ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో పూరి జగన్నాథ్ మొదటి గా పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకున్నాడ‌ట‌. కొన్ని కారణాలతో పవన్ కళ్యాణ్ సినిమా రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబుతో ఈ సినిమాని తీసి సూపర్ హిట్ కొట్టారు.

Nuvve Kavali (2000) - IMDb

ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి రవితేజకు ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో పాటు తన క్రేజ్ కూడా మరింత పెరిగింది. అయితే రెండు సినిమాల‌కి పూరి జగన్నాథే దర్శకుడు. ఈ రెండు సినిమాల కథలను కూడా పూరి.. పవన్ కళ్యాణ్ కు వినిపించగా బిజీగా ఉన్న ప‌వ‌న్ ఈ రెండు సినిమాలు రిజెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాల్లోనూ రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Vikramarkudu Movie Unknown Interesting Facts & It's All Remake Movies List  - Ravi Teja 2006 Telugu

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్టర్ హిట్‌. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్‌ను హీరోగా అనుకున్నాడట రాజమౌళి. పవన్ కళ్యాణ్ కు కథ వినిపించగా హెవీ యాక్ష‌న్ ఉంద‌ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ ఛాన్స్ రవితేజకు వెళ్లడంతో ఈ సినిమాలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించాడు. దాంతోపాటే అతని క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి.

Idiot (2002 film) - Wikipedia

నువ్వేకావాలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు తరుణ్. ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాను మొదటగా పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ తో చూడాలని ఉంది అని టైటిల్ తో సెట్స్ పైకి తీసుకువచ్చారట. ఏవో కారణాల చేత ఈ సినిమా ఆగిపోవడంతో.. తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వే కావాలి అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ అయింది.

Pokiri - Disney+ Hotstar