జ‌గ‌న్ బుజ్జ‌గించినా… వార్నింగ్ ఇచ్చినా డోన్ట్ కేర్… నెక్ట్స్ లిస్టులో ఎవ‌రు ?

వైసీపీలో పరిస్థితులు చేయి దాటినట్టే కనిపిస్తోంది. వైసీపీలో ఇప్పుడు నడుస్తోంది. అంతా వన్ సైడ్ రాజకీయం.. పార్టీ అధినేత కావచ్చు అధిష్టానంలో కీలకంగా ఉన్న నేతలు కావచ్చు.. వారు చెప్పిందే వేదం.. వారు చేసిందే శాసనం అన్నట్టుగా నడుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల మాటకు అసలు విలువే లేదని ఆ పార్టీ వాళ్లే పదేపదే చెబుతున్నారు. ఇక వైసిపిలో ఎంపీలు ఎప్పుడో డ‌మ్మీలు అయిపోయారు.మిథున్ రెడ్డి లాంటి ఒకరిద్దరిని పక్కన పెడితే మిగిలిన ఎంపీలు అస్సలు తెరమీద ఎక్కడా కనపడటం లేదు.

Nellore rural MLA Kotamreddy Sridhar Reddy drops hints of resigning from YSRCP fold | Vijayawada News - Times of India

ఇక నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన వైసిపి అధిష్టానం పార్టీలో ఎవరైనా గీత దాటితే ఇదే తరహా పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. అయితే ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. జగన్ బుజ్జగించినా… బ్రతిమిలాడినా… వార్న్ంగ్ ఇచ్చినా ఏం ? చేసినా కూడా ఎమ్మెల్యేలను చాలామంది వినే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికలలో జగన్ ఎలాగూ 60 నుంచి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరు. వీరంతా వైసిపిలోనే ఉంటూ జగన్ భజన చేస్తూ ఉంటారని అనుకోలేము.

Anam.Ramanarayana reddy (@AnamRamanaraya2) / Twitter

ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చాలామంది బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. మరో నాలుగు ఐదు నెలల తర్వాత పార్టీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కచ్చితంగా బయటకు వచ్చేస్తారని తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలకు కనీసం జగన్ దర్శనం మూడు నాలుగు సార్లు కూడా కలగలేదు అంటే ఎమ్మెల్యేలు ఏ స్థాయి ప్ర‌స్టేష‌న్‌లో ఉన్నారో అర్థమవుతుంది.

Thadikonda: MLA Undavalli Sridevi Faces Heat From Own Party Cadre!

శ్రీదేవి లాంటి ఎమ్మెల్యేలకు జగన్ స్వయంగా పిలిచి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేసినా ఆమె మాట వినలేదు. అంటే.. పార్టీపై జ‌గ‌న్‌కు క్రమక్రమంగా గ్రిప్పు తగ్గుతుందన్న సంకేతాలు అయితే బయటకు వచ్చేసాయి. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్యాడర్లోను ఆందోళనకు కారణమవుతోంది. మరికొద్ది నెలలోనే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి అటు రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారు పార్టీని వీడేందుకు మానసికంగా సిద్ధమయ్యారని.. అయితే సరైన టైమ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp