టాలీవుడ్‌లో సొంత విమానాలు ఉన్న స్టార్ హీరోలు వీళ్లే…!

ఒక్కసారి స్టార్ హీరో అయిన తర్వాత వారికొచ్చే ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మన టాలీవుడ్ లో ఉండే హీరోలకు ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చి వాళ్ళ సినిమాలు వరుసగా హిట్ అయితే.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు వారి ఆదాయం కూడా అంతకంతకు భారీగా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఆదాయం భారీగా సంపాదించే వారిలో చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు ఎందరో హీరోలు ఉన్నారు.

ఆదాయం పెరుగుతోన్న కొద్ది వారి స్టేట‌స్ ఆస్తుల విలువ కూడా కోట్ల‌లోనే పెరుగుతూ ఉంటుంది. దీంతో వాళ్లు ప్రైవేటుగానే జెట్సో లేదా విమానాలో కొనుక్కునే రేంజ్‌కు వెళ్లిపోతారు. టాలీవుడ్ హీరోల్లో కొందరికి సొంతంగా విమానాలు కూడా ఉన్నాయి. సొంత విమానాలు ఉన్న హీరోల గురించి ఒకసారి తెలుసుకుందాం రండి.

చిరంజీవి: మెగాస్టార్ కు సొంత జెట్ విమానం ఉంది. ఆయన తనయుడు రాంచరణ్ రూ.80 కోట్లు ఖ‌ర్చుపెట్టి దీనిని కొనుగోలు చేసాడట. మెగా ఫ్యామిలీ మొత్తం టూర్ల‌కు వెళ్ళేటప్పుడు దీనిని ఉపయోగిస్తారని సమాచారం‌.

ఎన్టీఆర్: సొంత కాళ్ల మీద స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఆదాయం కూడా భారీగానే ఉంది. మూడేళ్ల క్రితం 80 కోట్లు ఖర్చు చేసి సొంత విమానం కొన్నాడు.

అల్లు అర్జున్: ‘నా పేరు సూర్య’ సినిమా టైమ్‌లో సొంతంగా జెట్ ఫ్లైట్ ను కొన్నాడట బన్నీ..ఇక దాన్నీ కేవలం తన కుటుంబం కోసం మాత్రమే ఉపయోగిస్తారని సమాచారం‌

నాగార్జున: సినిమాల కంటే వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేసిన అక్కినేని నాగార్జున… ఫ్యామిలీతో ఎక్కడికి అయినా వెళ్ళడానికి విమానం కొన్నారట.